Site icon NTV Telugu

Suicide Plant: మొక్కే కదాని ముట్టుకుంటే.. ప్రాణాలు తీస్తుంది..

Suicide Plant

Suicide Plant

Suicide Plant: ఇంద్ర సినిమాలో ఫేమస్‌ డైలాగ్‌ ఒకటుంది గుర్తుందా.. అదేనండీ మొక్కే కదాని పీకేస్తే.. పీక కోస్తా అనే డైలాగ్‌ గుర్తొచ్చింది కదా.. ఇప్పుడు ప్రపంచంలో అటువంటి ముట్టుకుంటే చనిపోయే మొక్క ఒకటి ఉందని శాస్ర్తవేత్తలు గుర్తించారు. అటువంటి మొక్కను ముట్టుకోవద్దని.. దాని దగ్గరపట్లకు కూడా వెళ్లొద్దని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. అటువంటి మొక్కలేవో చూద్దాం..

Read also: Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తల పూజలు.. కౌంట్ డౌన్ స్టార్ట్

చెట్లను ప్రేమించే వారు కొందరుంటారు.. కొందరు చెట్లను పెంచేవారు ఉంటారు. పచ్చని చెట్లు చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్ల మధ్య కాసేపు గడిపితే చాలు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. స్వచ్చమైన గాలిని అందిస్తూ మేలు చేసే చెట్ల గురించే ఇప్పటివరకు మనకు తెలుసు.. కానీ కొన్ని మొక్కలు మనుషుల ప్రాణాలను తీయగలవని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కలు ఈ భూమ్మీద కొన్ని ఉన్నాయి. మొక్కే కదా కని పొరపాటున వాటిని ముట్టుకున్నా ప్రాణాలను తీసేస్తుంది. స్వయంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇంత భయంకరమైన మొక్కలు ఎక్కడ ఉన్నాయి? వాటి కథేంటో? చదండి..

Read also: Mohan Lal: మలయాళ సూపర్ స్టార్ సినిమాలో ‘శ్రీకాంత్ కొడుకు’…

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్కలుగా గింపీ-గింపీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉర్టికేసి రేగుట జాతికి చెందిన ఈ మొక్కలు ఎక్కువగా ఆస్త్రేలియా, ఇండోనేషియా అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. పొరపాటున వీటి ఆకులను తాకినా భయంకరమైన నొప్పి కలుగుతుందట. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునేలా ఇవి మనల్ని ప్రేరేపిస్తాయట. అందుకే ఈ మొక్కలను ‘సూసైడ్ ప్లాంట్ ’(Suicide Plant)అంటారు. వాటి వల్ల మనుషులకే కాదు, జంతువులకు కూడా హానీ కలుగుతుందట. 1886లో ఓ గుర్రం ఈ మొక్కను తాకిన కాసేపటికే మతిస్థిమితం కోల్పోయి 2గంటల్లోనే మరణించినట్లు పరిశోధకులు తెలిపారు. గింపీ-గింపీ ఆకులపై సన్నని సూదుల్లాంటివి ఉంటాయట… వీటిని ముట్టుకుంటే ఆ నొప్పి భరించలేక చనిపోవడమే బెటర్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఈ మొక్కల ఆకులను ముట్టుకున్న 30 నిమిషాల్లోనే దద్దుర్లు, వాపులు వచ్చి నొప్పి తీవ్రంగా మారుతుందట.. దీంతో నిద్రపోవడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు. పొరపాటున ఆ మొక్కలను ముట్టుకొని తక్షణం చికిత్స తీసుకున్నా పెద్దగా ఫలితం ఉండదట. చాలా సంవత్సరాల పాటు ఆ నొప్పి శరీరంలో అలాగే ఉంటుందట. కాబట్టి గింపీ జోలికి వెళ్లకపోవడమే మంచిదని పరిశోధనలు జరిపిన శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

Exit mobile version