Site icon NTV Telugu

Iceland: ఏ క్షణమైన బద్ధలవనున్న అగ్నిపర్వతం.. ఐస్‌లాండ్ హెచ్చరిక..

Grindavik

Grindavik

Iceland: యూరోపియన్ దేశం ఐస్‌లాండ్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వరసగా భూకంపాలు, అగ్ని పర్వతాల ప్రకంపనలు ఆ దేశాన్ని భయపెట్టిస్తున్నాయి. ఏ క్షణమైన అగ్ని పర్వతం భారీ విస్పోటనం చెందొచ్చని అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్ని పర్వత వ్యవస్థకు దగ్గరగా ఉన్న గ్రిండావిక్ పట్టణంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

రాజధాని రెక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉణ్న షిఫింగ్ పోర్టు టౌన్ అయిన గ్రిండావిక్ లో విస్పోటనం సంభవించే అవకాశ ఉన్నట్లు ఐస్‌లాండిక్ వాతావరణ కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే ఆ పట్టణంలోని 4000 మంది నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నవంబర్ 11కు ముందు ఏకంగా 48 గంటల్లో 1485 భూకంపాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also: Mansoor Ali Khan : త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్‌ అలీఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

అగ్నిపర్వతం నుంచి వచ్చిన లావా ప్రస్తుతం భూమి ఉపరితానికి చేరుకుంది. ఇప్పటికే గ్రిండావిక్ పట్టణం నేలతో కూరుకుపోతోంది. గత కొన్ని రోజులుగా రోజు 4 మీటర్ల చొప్పున నేలలోకి వెళ్తోంది. లావా భూమి కిందే ఉండటంతో అక్కడి భూఉపరితలం మొత్తం పగళ్లు తేలాయి. రోడ్లు, భవనాలు నేలలోకి కూరుకుపోతున్నాయి. శిలాద్రవం ప్రస్తుతం నేల కిందే ఉండటంతో అగ్నిపర్వతం విస్పోటనం కేవలం ‘30 నిమిషాల నోటీస్’ ఎప్పుడైనా జరగొచ్చని అక్కడి ప్రభుత్వం తెలిపింది. భూకంప కార్యకలాపాలు తగ్గుతున్నాయని, ఇది లావా భూమి ఉపరితలం కిందే ఉందనే దానికి సంకేతమని అక్కడి నిపుణులు చెబుతున్నారు.

దీనిపై ఐస్‌ లాండ్ ప్రధాని జాకోబ్స్ డోట్టిర్ మాట్లాడుతూ.. అగ్నిపర్వతాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కోసం ఐస్ లాండ్ తప్పితే మరే దేశం సిద్ధంగా లేదని అన్నారు. అగ్నిపర్వత విస్పోటనాలను ఎదుర్కొవడంలో మాకు సుదీర్ఘ అనుభవం ఉందని ఆమె శనివారం చెప్పారు. రెక్జాన్స్ ద్వీపకల్పంలో చివరిసారిగా 2021లో అగ్నిపర్వత విస్పోటనం సంభవించింది. ఎనిమిది దశాబ్ధాత తర్వాత అగ్నిపర్వతం బద్ధలైంది. ఐస్‌లాండ్ 33 క్రియాశీల అగ్నిపర్వతాల వ్యవస్థకు నిలయంగా ఉంది. గత వారం నుంచి గ్రిండావిక్‌లో విస్పోటం జరుగుతుందని దేశం ఎదురుచూస్తోంది.

Exit mobile version