Trump Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈరోజు ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై అక్కసు వెళ్లగక్కారు. ఏం చేయకపోయినా ఒబామాకు ఇచ్చారు.. 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.
Read Also: Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. కొనసాగుతున్న సునామీ హెచ్చరికలు..
అయితే, గురువారం నాడు వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. గాజాలో శాంతి నెలకొల్పడంతో సహా తాను 8 యుద్ధాలను ఆపడంలో సక్సెస్ అయ్యాను.. అయినా, తనకు ఈ అవార్డు ఇవ్వకపోవడంపై పీస్ కమిటీని తీవ్రంగా తప్పుబట్టారు. ఏమీ చేయకుండా 2009లో ఒబామా సైలెంట్ గా యూఎస్‌ను నాశనం చేసినందుకే వారు ఆ బహుమతిని ఇచ్చారు. కానీ, నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను.. అనేక మంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి చేశాను’ అని పేర్కొన్నారు.
Read Also: AP Fake Liquor Case: కల్తీ మద్యం ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వ ఖజానాకు గట్టి షాక్ !
ఇక, రెండోసారి అధికారం చేపట్టినప్పటినుంచి నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆరాటపడుతున్నారు. ఇందుకోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలతో పాటు అనేక గొడవలు ఆపానంటూ స్వయంగా అతడే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌తో సహా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి నేడు ప్రకటన రానుంది. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
