Hurricane Milton: మిల్టన్ తుపాను ఉద్ధృతికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పూర్తిగా అతలాకుతలమైంది. గురువారం సంభవించిన బలమైన సుడిగాలుల ధాటికి అక్కడి తీర ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. అనేక ఇళ్లు నేలమట్టం అవ్వగా.. వీధులన్నీ బురద మట్టితో నిండిపోయాయి. రెస్క్యూ టీమ్స్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక, ఈ తుఫాన్ ధాటికి 16 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, రెండు వారాల క్రితం హెలీన్ హరికేన్ తుపాన్ సృష్టించిన నష్టాన్ని మరిచిపోక ముందే ఇప్పడు మిల్టన్ విరుచుకుపడింది.
Read Also: Chedi Talimkhana Celebrations: నేడు అమలాపురంలో చెడీ తాలింఖానా ఉత్సవం.. ఏంటి దాని ప్రత్యేకత..?
అయితే, ఈ తుఫాన్ ధాటికి 32 లక్షల మందికి విద్యుత్తు సౌకర్యం లేక అంధకారంలో ఉండిపోయారు అక్కడి ప్రజలు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న దీవులను వరదలు పూర్తిగా ముంచెత్తాయి. గాలుల తీవ్రతకు ఓ బేస్ బాల్ స్టేడియం పైకప్పు ఎగిరి పోయి ముక్కలు ముక్కలుగా పడిపోయింది. నిర్మాణ పనుల్లో ఉన్న క్రేన్ సైతం కుప్ప కూలిపోయింది. సరసోటా కౌంటీలో తుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ 45 సెంటీ మీటర్ల మేర వాన పడుతుంది.