Site icon NTV Telugu

Dubai: దుబాయ్‌లో ప్రమాదకరంగా హీట్‌వేవ్.. యూఎస్ సైంటిస్టుల ఆందోళన

Dubai Heatwave

Dubai Heatwave

అత్యధిక ఉష్ణోగ్రతలు దుబాయ్‌ను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తేమ, వేడి అధికంగా ఉంది. ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తు్న్నారు. జూలై 17న 43 డిగ్రీల సెలియస్‌కు చేరుకోగా.. రెండు రోజుల్లోనే అమాంతంగా పెరిగిపోయింది. తాజాగా 19-07-2024న 62 డిగ్రీల సెలియస్‌కు చేరుకుంది. ఇది అత్యంత ప్రమాదకరమని వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ప్రస్తుతం మానవదేహం హీట్‌వేవ్‌ను తట్టుకునే స్థాయి దాటిపోయిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం యూఎస్ ఆధారిత వాతావరణ నివేదిక ప్రకారం దుబాయ్‌లో 62 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. ఇది అత్యంత తీవ్రమైందని పేర్కొంది. అధిక తేమ, అధిక ఉష్ణోగ్రత కారణంగా మానవ మనుగడ ప్రమాదకర స్థాయికి నెట్టేస్తోందని తెలిపింది. వెట్-బల్బ్ ఉష్ణోగ్రతలుగా పిలువబడే.. ఈ వాతావరణం 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండకూడదు. శరీరానికి 6 గంటలకు మించి ఉండకూడదు. లేదంటే ఇది ప్రాణాంతకంగా మారుతుందని తెలిపింది.

తాజా హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవుట్ డోర్ పనులు మానుకోవాలని సూచించింది. వేడి సంబంధించిన వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. జూలై 17న యూఎస్ ఆధారిత వాతావరణ పరిశీలకులు సోషల్ మీడియా ఛానల్‌లో హైలెట్ చేశారు.

ఇక హీట్‌వేవ్‌ను తట్టుకునేందుకు ప్రజలు ఏసీలను అధికంగా ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఈ హీట్‌వేవ్ పరిస్థితులు అక్టోబర్ వరకు కొనసాగనున్నాయి.

Exit mobile version