NTV Telugu Site icon

Nipah vaccine: ప్రపంచంలోనే తొలి “నిపా వైరస్” వ్యాక్సిన్.. మానవ పరీక్షలు ప్రారంభం..

Nipah Vaccine

Nipah Vaccine

Nipah vaccine: ప్రాణాంతక నిపా వైరస్ నుంచి మానవులను కాపాడేందుకు వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే తొలి నిపా వ్యాక్సిన్ మానవ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ విధానంలో ఆస్ట్రాజెనెకా (AZN.L) మరియు సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉపయోగించిన అదే సాంకేతికత ఆధారంగా ఈ వ్యాక్సిన్ రూపొందిస్తు్న్నారు. నిపా వైరస్ కోసం తయారు చేయబడిన ChAdOx1 NiV అని పిలిచే ఈ వ్యాక్సిన్ ప్రిలినికల్ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత, హ్యూమన్ టెస్టింగ్ దశలోకి ప్రవేశించింది.

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ 52 మందితో హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించింది. 18-55 ఏళ్ల వయసున్న వారికి టీకా ఇచ్చి వారిలో రోగనిరోధక వ్యవస్థ స్పందన, వారి భద్రతను అంచనా వేస్తారు. ఆక్స్‌ఫర్డ్ ట్రయల్స్‌లో మొదట పాల్గొనే వారు గత వారంలో వ్యా్క్సిన్ డోసుని తీసుకున్నారు. ట్రయల్స్‌కి ఆక్స్‌ఫర్డ్ నాయకత్వం వహిస్తుండగా.. మానవ పరీక్షల కోసం CEPI నిధులు సమకూరుస్తోంది.

Read Also: Taiwan: చైనాకి గట్టి దెబ్బ.. తైవాన్ ఎన్నికల్లో లై చింగ్-తే విజయం..

నిపా అంటువ్యాధి, గబ్బిలాల, పందుల నుంచి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. గబ్బిలాలు తిన్న పండ్లను మానవులు తీసుకుంటే ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. 25 ఏళ్ల క్రితం మొట్టమొదట మలేషియాలో దీనిని గుర్తించారు. బంగ్లాదేశ్, భారత్, సింగపూర్ దేశాల్లో కూడా ఈ వ్యాధి వ్యాప్తికి దారి తీసింది. సెప్టెంబర్ 2023లో, కేరళలో నాలుగోసారి నిపా వైరస్ ప్రబలింది. ఇద్దరు మరణించారు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో పాటు ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వంటి లక్షణాలకు దారి తీస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం దీని మరణాల రేటు 40 శాతం నుండి 75 శాతం వరకు అంచనా
వేసింది.