NTV Telugu Site icon

Hippo Swallows Boy: రెండేళ్ల బాలుడిని మింగేసిన హిప్పో.. ట్విస్ట్ ఏంటంటే..?

Hippo Attack

Hippo Attack

Hippo swallows 2-yr-old boy in Uganda, spits him out alive: కొన్నిసార్లు అదృష్టం ఎలా వస్తుందో తెలియదు. ప్రాణాలు పోతాయనుకునే చివరి క్షణాల్లో బతికిరావడం చూస్తుంటాం. క్షణకాలంలో ప్రమాదాల నుంచి బతుకుజీవుడా అంటూ తప్పించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే మృగాల బారినపడిన తర్వాత మళ్లీ బతకడం అంటే దాదాపుగా అసాధ్యం. ఎంతో లక్ ఉంటే తప్పా ప్రాణాలతో బయటపడం. కానీ ఉగాండా దేశంలో మాత్రం ఏ రెండేళ్ల పిల్లాడి విషయంలో అదృష్టం అనే పదం చాలా తక్కవ అని చెప్పవచ్చు.

Read Also: Manchu Manoj: కాబోయే భార్యతో మరోసారి మీడియా కంటపడ్డ మనోజ్.. ఈసారి

ఉగాండాలో రెండేళ్ల పిల్లడిని అడవి హిప్పో మొత్తంగా మింగేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మళ్లీ మృత్యుంజయుడిగా పిల్లాడు తిరిగి బయటకు వచ్చాడు. పాల్ ఇగా అనే పసివాడిని హిప్పొ మింగిన తర్వాత.. తిరిగి ఉమ్మివేసింది. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆదివారం కట్వే కబటోరోలోని ఎడ్వర్డ్ సరస్సు ఒడ్డుకు 800 గజాల దూరంలో 2 ఏళ్ల పాల్ ఆడుకుంటున్నాడు. ఆకాస్మత్తుగా వచ్చిన భారీ హిప్పో దాని దవడలతో పిల్లాడిని పట్టుకుంది. అది మింగేసే సమయంలో స్థానికులు దాన్ని రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. అయితే లక్కీగా బాలుడిని తన నోట్లో నుంచి ఉమ్మేయడంతో ప్రమాదం తప్పింది.

ఇలా ఓ హిప్పో పిల్లాడిపై దాడి చేయడం ఇదే మొదటి సంఘటన అని అక్కడి పోలీస్ అధికారి వెల్లడించారు. హిప్పోను రాళ్లతో కొట్టడం ప్రారంభించిన క్రిస్పాస్ బాగోంజా అనే వ్యక్తి దైర్య సహాసాలను అంతా ప్రశంసిస్తున్నారు. హిప్పో దాడిలో పాల్ కు స్వల్పగాయాలు అయ్యాయి. పిల్లాడికి రేబిస్ వ్యాక్సిన్ వేసిన వైద్యులు ఆ తరువాత డిశ్చార్జ్ చేశారు.

Show comments