Site icon NTV Telugu

కాబూల్‌ను మాత్రం వీడ‌ను.. చంపినా స‌రే అంటున్న పూజారి

Hindu priest

ఆఫ్ఘ‌నిస్థాన్‌ను మ‌ళ్లీ తాలిబ‌న్లు త‌మ ఆధీనంలోకి తెచ్చుకోవ‌డంతో.. చాలా హృద‌య‌విదార‌క‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్థున్నాయి.. ప్రాణాలు గుప్పిట్లో ప‌ట్టుకుని.. దేశాన్ని విడిచి వెళ్లేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు.. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లో భ‌యంక‌ర‌మైన ర‌ద్దీ క‌న‌బ‌డుతోంది.. విమానం టేకాన్‌ను వెళ్లే స‌మ‌యంలోనూ వెంట‌ప‌డి మ‌రి.. చ‌క్రాల ద‌గ్గ‌రైనా చోటు దొర‌క‌క‌పోతుందా? అంటూ వేలాడి వేళ్లేవాళ్లు కొంద‌రైతే.. మ‌రికొంద‌రు జారిప‌డి ప్రాణాలు కూడా వ‌దిలారు.. అయితే, ఏదేమైనా.. తాలిబ‌న్లు నా ప్రాణం తీసినా స‌రే.. తాను మాత్రం కాబూల్‌ను వ‌దిలేది లేదంటున్నారు ఓ దేవాల‌య పూజారి.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కాబూల్‌లో వందేళ్ల చ‌రిత్ర క‌లిగిన ర‌త‌న్‌నాథ్ ఆల‌యం ఉంది.. అక్క‌డ పండిత్ రాజేష్ కుమార్ అనే వ్య‌క్తి పూజారిగా ప‌నిచేస్తున్నారు.. అయితే, తాలిబ‌న్లు చంపితే చంప‌నీ.. వాళ్లు చంపినా అది నా సేవ‌లాగే భావిస్తా అంటున్నారు.. కొన్ని వంద‌ల ఏళ్లుగా ఆయ‌న పూర్వీకులు కూడా ఆ ఆల‌య సేవ‌లోనే ఉన్నార‌ట‌.. అలాంటి ఆల‌యాన్ని తాను వ‌దిలేసి వెళ్ల‌న‌ని రాజేష్ కుమార్ స్ప‌ష్టం చేస్తున్నారు.. కొంత‌మంది హిందువులు న‌న్ను కాబూల్ విడిచి వెళ్ల‌మ‌న్నారు.. వాళ్లే నా ప్ర‌యాణానికి, నేను ఉండ‌టానికి ఏర్పాట్లు కూడా చేస్తామ‌ని చెప్పార‌న్న ఆయ‌న‌.. కానీ, ఈ ఆల‌యంలో నా పూర్వీకులు వంద‌ల ఏళ్లుగా సేవ చేశారు. నేను ఈ గుడిని వ‌ద‌ల‌లేను.. తాలిబ‌న్లు చంపితే, నేను దాన్ని నా సేవ‌గా భావిస్తాను అని అంటున్నారు.

Exit mobile version