Hi Mum Scam Australians Lost More Than 7 Million Dollars: ఒకప్పటిలా సైబర్ నేరగాళ్ల వలలో జనాలు చిక్కుకోవట్లేదు. వాళ్ల పన్నాగాల్ని సునాయాసంగా పసిగడుతున్నారు. అందుకే.. జనాల్ని బురిడీ కొట్టించేందుకు వాళ్లు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆఫర్లు, లాటరీ అంటూ గాలం వేయకుండా.. పరిచయం ఉన్న వ్యక్తులుగా నమ్మించి, శఠగోపం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులోనూ వాళ్లు దాదాపు సక్సెస్ అవుతున్నారు. తెలిసిన వ్యక్తుల పేర్లతో సందేశాలు చేస్తూ.. ఈజీగా డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ ఇలాంటిదే ఒక స్కామ్ వెలుగు చూసింది. ఆ స్కామ్ పేరు ‘హై మమ్ స్కామ్’.
West Bengal Strange Lights: ఆకాశంలో వింత.. స్పేస్‌షిప్ అంటూ జనాలు గిలిగింత
‘‘హై మమ్.. ఎలా ఉన్నావ్.. ఇది నా కొత్త నంబర్.. సేవ్ చేసుకో.. ఒకవేళ నువ్వు ఈ మెసేజ్ చూస్తే, వెంటనే నాకు రిప్లై ఇవ్వు’’.. ఇలా కొత్త నంబర్‌తో సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. ఈ సందేహాలు చూస్తే.. నిజంగా తమ సంతానమే అవి పంపించినట్టు అనిపిస్తుంది. ఆస్ట్రేలియన్స్ కూడా అలాగే భ్రమ పడ్డారు. ఆ సందేశానికి రిప్లై ఇస్తే.. తాము ఫలానా సమస్యల్లో ఉన్నామని, కొంత డబ్బు పంపించాలని ఇంకో మెసేజ్ వస్తుంది. ఇంకేముంది.. తమ సంతానం నిజంగానే సమస్యల్లో ఉందేమో అని, డబ్బులు పంపించారు. ఇలా షాపింగ్ పేరిట, స్కూల్ ఫీజ్ పేరిట.. ఇంకా రకరకాలుగా మోసం చేస్తూ వందల కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అక్కడి రిపోర్ట్స్ ప్రకారం.. ఇలాంటి మెసేజీలతో ఈ ఏడాది ఏకంగా 7.2 మిలియన్ డాలర్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్టు తేలింది. దీంతో.. దీనికి ‘హై మమ్ స్కామ్’గా పేరొచ్చింది.
Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు.. శవం లేచి కూర్చుంది
ఈ సైబర్ నేరగాళ్ల ఆగడానికి సుమారు 11 వేల మంది ఆస్ట్రేలియన్లు బాధితులుగా మిగిలిపోయారు. ఆ బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. ఆస్ట్రేలియా వినియోగదారుల హక్కుల పరిరక్షణ విభాగం ట్విటర్ మాధ్యమంగా ప్రజల్ని హెచ్చరించింది. బంధువులు, స్నేహితులమని చెప్పుకుంటూ.. కొత్త నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని, ధృవీకరణ చేసుకున్నాకే స్పందించాలని సూచించింది. ఒకటికి రెండు సార్లు అన్నీ సరి చూసుకొని, ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలని పేర్కొంది.