Site icon NTV Telugu

Hezbollah Deputy: ఇజ్రాయెల్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం..

Israil

Israil

Hezbollah Deputy: పశ్చిమాసియాలో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌ హెజ్‌బొల్లా మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్నాయి. భీకర దాడులతో హెజ్‌బొల్లాకు చెందిన కీలక నేతలను ఇజ్రాయెల్‌ వరుసగా చంపేస్తుండంతో ఉద్రికత్తలు మరింత పెరిగాయి. హసన్ నస్రల్లా మరణానంతరం హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌, తాత్కాలిక నాయకుడిగా నయీమ్ కస్సేమ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలిసారి మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Read Also: Game Changer : ఆకట్టుకుంటున్న ‘రా మచ్చా.. మచ్చా’ సాంగ్‌…

ఇక, ఇజ్రాయెల్‌ భూతల దాడులను స్టార్ట్ చేయాలనుకుంటే.. అందుకు తాము కూడా రెడీగానే ఉన్నామని హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ కస్సేమ్ తెలిపారు. హెజ్‌బొల్లాలోని కీలక మిలటరీ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది.. కానీ, ఆ దాడులు మా సైనిక సామర్థ్యాలను ప్రభావితం చేయలేకపోయిందన్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించాం.. మా ప్రాంతాలను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌పై పోరాటం చేస్తాం.. మా సంస్థ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైందని నయీమ్‌ కసేమ్‌ పేర్కొన్నారు.

Read Also: RK Roja: సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు..

అయితే, కొన్ని రోజులుగా హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది. బీరుట్‌పై జరిగిన దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా మరణించారు. ఆ తర్వాత మరో కీలక నేతను కూడా ఐడీఎఫ్‌ దళాలు చంపేశాయి. దాడులు ప్రారంభమైన 10 రోజుల వ్యవధిలోనే నస్రల్లాతో సహా ఆరుగురు కీలక కమాండర్లను హతమర్చింది ఇజ్రాయెల్. లెబనాన్‌లో 1000కి పైగా ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

Exit mobile version