Site icon NTV Telugu

Nepal: నేపాల్‌లో హెలికాప్టర్‌ గల్లంతు.. హెలికాప్టర్‌లోని ఆరుగురు మృతి

Nepal

Nepal

Nepal: ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలతోపాటు.. హెలికాప్టర్‌ ప్రమాదాలు కూడా అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ మధ్య జరిగిన విమాన ప్రమాదాల్లో మరణాలు సంభవించకపోయినప్పటికీ.. గాయాలపాలవుతున్న వారు ఉంటున్నారు. నేపాల్‌లో హెలికాప్టర్‌ ఒకటి గల్లంతు అయింది. హెలికాప్టర్‌లో 6 మంది ప్రయాణీకులు ఉండగా.. వారిలో ఐదుగురు మెక్సికన్‌లుగా తెలుస్తోంది. నేపాల్‌లో ఐదుగురు మెక్సికన్‌ దేశస్థులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ జాడ అదృశ్యమైంది. ఎవరస్ట్‌ శిఖరం వద్ద ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లో ‘మనంగ్‌ ఎయిర్‌’కు చెందిన ఓ హెలికాప్టర్‌ గల్లంతైంది. ఆ సమయంలో దానిలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఐదుగురు విదేశీయులే. ఈ హెలికాప్టర్‌ సోలుకుంభు నుంచి కాఠ్‌మాండూకు ప్రయాణిస్తుండగా హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమయిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Read also: IND vs WI Dream11 Prediction: భారత్ vs వెస్టిండీస్‌ తొలి టెస్టు.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!

9ఎన్‌-ఏఎంవీ కాల్‌ సైన్‌తో వ్యహరించే ఈ హెలికాప్టర్‌ సోలుకుంభులోని సుర్కీ అనే ప్రదేశం నుంచి గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకొంది. దీనిని సీనియర్‌ పైలట్‌ చెట్‌ గురుంగ్‌ నడుపుతున్నారు. అతడితోపాటు ఐదుగురు విదేశీయులు కూడా ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన చోటు చేసుకొన్న ప్రదేశం ఎవరస్ట్‌ శిఖరానికి సమీపంలో ఉంటుంది. ఈ విషయాన్ని నేపాల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారి జ్ఞానేంద్ర భుల్‌ ఒక పత్రికకు వెల్లడించారు. ఆ హెలికాప్టర్లో అమర్చిన జీపీఎస్‌ సంకేతాలు లమ్జురాపాస్‌ వద్ద నిలిచిపోయినట్లు ఆయన చెప్పారు. నేపాల్‌లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో మంగళవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు మెక్సికన్లతో సహా ఆరుగురు మరణించారు. రక్షకులు ఐదు మృతదేహాలను కనుగొన్నారు ఆరవ మృతదేహాన్ని వెతుకుతున్నారని ఖాట్మండు విమానాశ్రయ అధికారి తెలిపారు. మౌంట్ ఎవరెస్ట్‌కు సందర్శనా పర్యటన కోసం ఐదుగురు విదేశీ పర్యాటకులతో బయలుదేరిన మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ మంగళవారం ఉదయం సోలుఖున్‌వు నుండి ఖాట్మండుకు తిరిగి వస్తుండగా లాంజురా వద్ద కూలిపోయింది. లంజురాలోని ఒక గ్రామంలోని నివాసితులు హెలికాప్టర్ శిధిలాలను గుర్తించారు.

Exit mobile version