Site icon NTV Telugu

Heartbreaking: ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ఏం చేశారంటే..

Untitled Design (1)

Untitled Design (1)

ఆఫికా ఖండంలోని చాలా దేశాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఉగాండాలో తీవ్రమైన ఆహార కొరతతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితులు ఎలా ఉన్నాయో అని.. అయితే.. ఉగాండాలో హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది. ఆకలికి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు బతికున్న పురుగులు తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Read Also: Shocking Inciden: కారు డ్రైవ్ చేస్తుండగా..సైడ్ మిర్రర్ నుంచి బయటకు వచ్చిన పాము…

ఉగాండాలో తీవ్రమైన ఆహార కొరత ప్రపంచాన్ని కలవర పెడుతుంది. కనీసం కడుపు నిండా తిండిలేక ఇక్కడి పిల్లలు, పెద్దలు బక్కపలచగా, ఎముకల గూడు మాదిరి కనిపిస్తున్నారు. ఈ దేశంలోని కరమోజా సబ్ రీజన్‌లోని ప్రజలు ఆహార కొరతతో అల్లాడిపోతున్నారు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడి పిల్లలు ఆకలి తట్టుకోలేక బతికున్న పురుగులు తింటున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: Special Fan: టేబుల్ ఫ్యాన్ కు.. సీలింగ్ ఫ్యాన్ సెట్ చేసిన యువకుడు

ఆఫ్రికన్ దేశమైన ఉగాండాలోని ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు. తినడానికి ఆహారంలేక ఇబ్బందులు పడుతున్నారు.. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ఆకలితో చనిపోయిన సందర్భాలు లేకపోలేదు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం గడ్డి కూడా తినేందుకు వెనుకాడడంలేదు. అయితే ఓ ఇద్దరు చిన్నారులు ఆకలి మంటతో బతికున్న పురుగులను తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు పిల్లలు తమకు ఎదురుగా ప్లేట్‌లలో ఉన్న బతికున్న పరుగులను నోట్లో వేసుకుని కడుపు నింపుకుంటున్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి బాధరా నాయనా అంటూ.. తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వారి ఆకలిని తీర్చేందుకు దేవుడే దిగి రావాలంటూ వేడుకుంటున్నారు.

Exit mobile version