Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..

  • మరోసారి విస్పోటనం చెందిన కిలావుయా అగ్నిపర్వతం..
  • 2024 నుంచి 55వ సారి విస్పోటన ఘటన..
Kilauea Volcano

Kilauea Volcano

Kilauea volcano: అమెరికాలోని హవాయి ద్వీపంలోని క్రియాశీల అగ్నిపర్వత్వం కిలావుయా మరోసారి విస్పోటనం చెందింది. అక్టోబర్ 17న జరిగిన విస్పోటనంలో లావా ఫౌంటెన్లు ఎగిసిపడ్డాయి. సుమారు 700 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసిపడింది. 2024 డిసెంబర్ నుంచి గత 22 నెలల వ్యవధిలో ఇది 55వ సారి విస్పోటనం చెందడం.

హవాయిలోని వోల్కనోస్ నేషనల్ పార్క్‌లో ఉన్న కిలావుయా అగ్నిపర్వతం ఉత్తర బిలం వద్ద స్థానిక కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 3.19 గంటలకు లావా బయటకు రావడం ప్రారంభమైంది. ఉదయం 5 గంటల సమయానికి బయటకు రావడం తీవ్రమైంది. ఈ ప్రక్రియ సుమారు 6 గంటల పాటు కొనసాగి ఉదయం 9 గంటలకు ముగిసింది. అగ్నిపర్వతం పేలుడు ధాటికి ఎగిసిపడిన బూడిద మేఘం సుమారు 25,000 అడుగుల ఎత్తుకు చేరింది.

చివరిసారిగా దాదాపు 2 నెలల క్రితం మళ్లీ కిలావుయా విస్పోటనం చెందింది. చివరిసారిగా ఆగస్టు 25న ఇది జరిగింది. తాజా విస్పోటనం మొత్తం హలేమా ఉమాఉ అగ్ని పర్వత బిలానికి మాత్రమే పరిమితం కావడంతో చుట్టుపక్కట ప్రాంతాలకు పెద్దగా ప్రమాదం జరగలేదు. కిలావుయా ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లోఒకటి.