Hawaii flight turbulence injures 36 passengers: అప్పటివరకూ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంకాసేపట్లో విమానం ల్యాండ్ అవ్వబోతోందని తెలిసి, ప్రయాణికులందరూ గమ్యస్థానంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, ఇంతలోనే చోటు చేసుకున్న అనూహ్య పరిణామంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. విమానాశ్రయంలో దిగడానికి కొద్దిసేపటి ముందు.. బలమైన గాలులు ఆ విమానాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ దెబ్బకు లోపలున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 36 మంది గాయపడగా, వారిలో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. విమానం పైకప్పు క్రాక్స్ వచ్చాయంటే.. ఏ రేంజ్‌లో గాలులు ఆ విమానాన్ని కుదిపేశాయో అర్థం చేసుకోవచ్చు.
Police Training: వరంగల్‌లో విషాదం.. పోలీస్ నియమకాల్లో అస్థస్థతకు గురై, అభ్యర్థి మృతి
హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం.. ఫీనిక్స్ నుంచి హొనొలులుకు బయలుదేరింది. ఇందులో 10 మంది క్రూ మెంబర్స్, 278 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. సీటుబెల్టులు సరిగ్గా ధరించని వారు.. ఈదులు గాలులు వీచినప్పుడు ఒక్కసారిగా పైకి ఎగిరారు. విమానం పైకప్పును ఢీకొట్టుకొని, కింద పడ్డారు. మరికొందరు అటూఇటు ఊగిపోయారు. కిటికీలను, ముందున్న సీట్లను ఢీకొట్టారు. విమానం ఎత్తు రెండుసార్లు అకస్మాత్తుగా తగ్గిపోయిందని, అప్పుడు కొందరు ప్యాసింజర్లు సీట్ల నుంచి గాల్లో ఎగిరినట్టు అయ్యిందని పలువురు ప్రయాణికులు చెప్పారు. ఈ విమానం కుదుపులకు గురవ్వడంతో.. అత్యవసర ల్యాండింగ్‌కి అనుమతి ఇచ్చారు. ల్యాండ్ అయిన వెంటనే, హొనొలులు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ రంగంలోకి దిగి, గాయపడిన వారికి చికిత్స అందించింది. తీవ్ర గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఎమర్జెన్సీ రూమ్స్‌కి తరలించారు.
Jai Shankar: సరిహద్దుల్ని మార్చాలని చైనా ప్రయత్నిస్తే.. భారత సైన్యం చూస్తూ ఊరుకోదు
ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జోన్ స్నూక్ మాట్లాడుతూ.. రీసెంట్ హిస్టరీలో ఇలాంటి సంఘటనని ఎప్పుడు చూడలేదని అన్నారు. ఈ ప్రమాదంలో కొందరు విమానం పైకప్పుతో ఢీకొట్టారని అన్నాడు. ఒకవేళ సీట్ బెల్ట్ వేసుకోకపోతే.. ఇలాంటి సంఘటనల సమయంలో గాయాలు తప్పకుండా అవుతాయని పేర్కొన్నాడు. ఇదే సమయంలో హోనోలులు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జిమ్ ఐర్లాండ్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో గాయపడ్డ 20 మందిని ఆసుపత్రులకు తరలించామని, వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఒక వ్యక్తి అయితే అపస్మారక స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. కొందరికి తలపై గాయాలయ్యాయని, విపరీతమైన కదలికల కారణంగా కొంతమందికి వికారం, వాంతులు జరిగాయని చెప్పారు.