NTV Telugu Site icon

Bangladesh: షేక్ హసీనా సర్కార్ పతనంపై తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ సంచలన వ్యాఖ్యలు

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఆమె భారత్‌కు వచ్చి తలదాచుకుంటుంది. అనంతరం నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను దించడం ప్లాన్‌ ప్రకారం జరిగిన కుట్రే అని వ్యా్ఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ ఉన్నారు.

ఇది కూడా చదవండి: Devara: అందరి ఎదురుచూపులు అందుకే!

విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్‌కు కొత్త రూపు తీసుకువచ్చారని యూనస్ కొనియాడారు. హసీనాను పదవి నుంచి దింపే కుట్ర వెనక ఎవరున్నారో బయటకు రాలేదు కానీ.. మహఫుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని చెప్పుకొచ్చారు. తొలుత అమెరికా పేరు వినిపించింది. కానీ ఆ వార్తలను వైట్‌హౌస్ ఖండించింది.

ఇది కూడా చదవండి: Amit Shah: ఆయుధాలు వదలి చర్చలకు రండి, లేదంటే చస్తారు.. ఉగ్రవాదులకు అమిత్ షా పిలుపు..

Show comments