Site icon NTV Telugu

Hamas Attack On Israel: ఇజ్రాయిల్‌పై దాడికి 7 ఏళ్ల నుంచే నిఘా పెట్టిన హమాస్..

Hamas Attack On Israel

Hamas Attack On Israel

Hamas Attack On Israel: అక్టోబర్ 07, 2023న గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై భీకర దాడి చేశారు. ఒకేసారి వందలాది రాకెట్లను ప్రయోగించడంతో పాటు హమాస్ మిలిటెంట్ ఇజ్రాయిల్ కంచెను దాటి సరిహద్దు గ్రామాల్లో మారణహోమం సృష్టించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందర్ని దారుణంగా చంపేశారు. అప్పటి నుంచి మొదలైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. హమాస్ చేసిన దాడిలో దాదాపుగా 1200 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 251 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి పట్టుకెళ్లారు. ఈ దాడికి ప్రతీకారంగా గాజాతో పాటు పాలస్తీనాలోని అన్ని ప్రాంతాలపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వరకు 45,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. అనేక లక్షల మంది వలస వెళ్లారు.

Read Also: Elon Musk: పేరు మార్చుకున్న మస్క్.. ఎక్స్ ప్రొఫైల్ పిక్ కూడా ఛేంజ్! అర్థమేంటంటే..!

అయితే, ఈ దాడికి ముందుగా దాదాపుగా 7 ఏళ్ల నుంచి హమాస్ ఇజ్రాయిల్‌పై నిఘా పెట్టినట్లు తేలింది. హమాస్ నుంచి స్వాధీనం చేసుకున్న అనేక పత్రాలు, ఇజ్రాయిల్‌లోని కమ్యూనిటీ లివింగ్ ఏరియాలపై నిఘా పెట్టినట్లు తేలింది. హమాస్ కార్యకర్తలు ఇజ్రాయిల్‌లోని కిండర్ గార్టెన్, హెల్త్ క్లినిక్‌కి సంబంధించిన వివరాలను సేకరించారు. కిబ్బట్జ్‌లోని ఇన్‌స్టాల్ చేసిన అన్ని భద్రతా కెమెరాల ఐపీ అడ్రస్‌లను, సీరియల్ నెంబర్లను పొందారు. ఇదే కాకుండా సరిహద్దు వద్ద ఉన్న వివిధ సెక్యూరిటీ గార్డుల ఫోన్ నెంబర్లు కూడా సంపాదించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. దాడికి సంబంధించి, దాడి చేసే ప్రాంతాల నిఘా ఫోటోలను తీసిందని ఇజ్రాయిల్ గుఢచార సంస్థ షిన్‌బెట్ మాజీ ఉన్నతాధికారి షాలోమ్ బెన్ హనన్ అన్నారు.

Exit mobile version