NTV Telugu Site icon

Hamas: ఇజ్రాయెల్ బందీల విడుదలపై హమాస్ కీలక ప్రకటన

Hamas

Hamas

హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ మృతిని హమాస్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ప్రకటించింది. పాలస్తీనా కోసం చివరి వరకు పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ బందీల విడుదలపై హమాస్ కీలక ప్రకటన చేసింది. తమ ప్రాంతంపై బాంబు దాడులు ఆపి, దళాలను ఉపసంహరించుకోవాలని సూచించింది. యుద్ధం ముగిస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ తేల్చి చెప్పింది. అంతేకాకుండా జైల్లో ఉన్న పాలస్తీనియన్లను వదిలిపెట్టే వరకు బందీలను విడుదల చేయబోమని శుక్రవారం స్పష్టం చేసింది. గాజాపై దురాక్రమణ ఆపకపోతే.. ఇజ్రాయెల్ బందీలు మాత్రం తిరిగి రారని హమాస్ తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు హమాస్‌కు చెందిన ఖలీల్ అల్ హయా ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలా..? ముఖ్యంగా దానికి

2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడికి పురికొల్పింది యాహ్యా సిన్వారే. అతని సారథ్యంలోనే ఇజ్రాయెల్‌పై దాడి జరిగింది. అప్పటి నుంచి అతడి కోసం ఇజ్రాయెల్ జల్లెడపడుతోంది. వివిధ వేషాలు మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. అనూహ్యంగా గురువారం ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. యాహ్యా సిన్వార్ (62) దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో జన్మించారు. 2017లో హమాస్ నాయకుడిగా ఎన్నికయ్యారు. సగ జీవితం ఇజ్రాయెల్ జైల్లోనే గడిపాడు. అత్యంత శక్తివంతమైన హమాస్ నాయకుడిగా ఎదిగాడు. హమాస్ అధినేత ఇస్మాయేల్ హనియే ఇరాన్‌లో మరణం తర్వాత సిన్వార్ సజీవంగా ఉండి హమాస్‌ను ముందుండి నడిపించాడు. ఇప్పుడు అతడు కూడా చనిపోవడంతో హమాస్ పని దాదాపు పూర్తైనట్లే చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి: Minister Satya Kumar Yadav: మంత్రి లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి