Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడింది. 1200 మందిని చంపడంతో పాటు 240 మంది వరకు బందీలను పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. అయితే, ఇరు పక్షాల సంధి తర్వాత కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. అయితే, బందీలుగా విడుదలైన వారు హమాస్ అకృత్యాల గురించి బయటపెడుతున్నారు. లైంగిక వేధింపుల, దాడులకు తెగబడిన విషయాలను విడుదలైన వారు చెప్పారు.
తాజాగా 18 ఏళ్ల యువతి, తనకు హమాస్ ఉగ్రవాది నుంచి ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. నోగా వీస్ అనే యువతి దాదాపుగా 50 రోజులు బందీగా ఉన్న తర్వాత ఇజ్రాయిల్-హమాస్ సంధి ద్వారా విడుదలైంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు నోగాను కిడ్నాప్ చేశారు. తను బందీగా ఉంచిన హమాస్ మిలిటెంట్ తనను పెళ్లి చేసుకోవాలని, తన పిల్లలకు తల్లిగా ఉండాలని కోరినట్లు వెల్లడించింది. అతను ఒక ఉంగరాన్ని కూడా ఇచ్చాడని చెప్పింది. అందరూ విడుదలవుతారు, కానీ తాను మాత్రం తన పిల్లల్ని పెంచేందుకు గాజాలోనే ఉంటావని చెప్పేవాడని యువతి వెల్లడించింది.
Read Also: Amritpal Singh: లోక్‌సభ ఎన్నికల్లో అమృతపాల్ సింగ్ పోటీపై కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..!
హమాస్ మిలిటెంట్ తనకు 14 రోజుల తర్వాత ఒక ఉంగరాన్ని ఇచ్చినట్లు, తాను అతడితో 50 రోజుల వరకు ఉన్నానని నోగా చెప్పింది. ఇజ్రాయిల్‌లోని కిబ్బట్జ్ బీరి లోని తన ఇంటిపై దాడి చేసినప్పుడు తన తల్లిదండ్రులతో ఉన్నట్లు యువతి వెల్లడించింది. తన తండ్రి ఎమర్జెన్సీ స్వ్కాడ్‌లో చేరేందుకు వెళ్లి మరణించాడని తెలిపింది. అయితే, నోగాతో పాటు ఆమె తల్లి షిరిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించినట్లు వెల్లడించింది.
బందీగా ఉన్న సమయంలో పలుమార్లు తాము ఉంటున్న చోటును మార్చారని, బయటకు వెళ్లే ముందు బుర్ఖా ధరించి, తన చేతిని పట్టుకోవాలని హమాస్ మిలిటెంట్ కోరేవాడని, దీని వల్ల తాను ఇజ్రాయిల్ బందీ అని తేలియకుండా ఉండేలా చేసేవారని చెప్పింది. వారు తనతో ఆడుకోవడానికి కార్డ్స్ తీసుకువచ్చారని, తనను షూట్ చేయనంత వరకు మీకు కావాల్సింది చేస్తానని చెప్పానని, అయితే వారు త్వరగా మారిపోయేవారని, అప్పుడే నవ్వి తర్వాత క్షణమే గన్స్‌తో వచ్చేవారని నోనా చెప్పింది.
చాలా రోజుల తర్వాత హమాస్ మిలిటెంట్ తనపై ప్రేమను వ్యక్తపరిచాడని,ఆ క్షణంలో చిరునవ్వు నవ్వడం తప్పా తనకు వేరే అవకాశం లేకపోయినట్లు వెల్లడించింది. ఈ వివాహాన్ని అంగీకరించేందుకు తన తల్లిని తన వద్దకు తీసుకువచ్చాడని నోగా చెప్పింది. అయితే, ఆమె తల్లి మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేదని, ఆ క్షణంలో తాను గాజాలోనే కలకాలం ఉండీపోతాననే భయం వెన్నాడినట్లు తెలిపింది.