World Record: పుట్టిన రోజు ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకం. పుట్టిన రోజు వేడుకలను ఎక్కువ మంది జరుపుకుంటారు. వారికి ఉన్నంతలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. అయితే కొందరి ఇండ్లలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అవేంటంటే తండ్రి, కొడుకు పుట్టిన రోజు ఒకటే రోజు ఉండటం.. అలాగే తండ్రి, కూతురు పుట్టిన రోజు ఒకే రోజు ఉండటం. ఇది కొంత రేర్‌గా జరిగే విషయాలు. ఇక కొందరి ఇండ్లలో చాలా రేర్‌గా ముగ్గురి పుట్టిన రోజు ఒకే రోజుగా ఉండటం చాలా అరుదుగా చూస్తాం. అయితే ఇక్కడ ప్రపంచ గిన్నిస్ రికార్డు పుట్టిన రోజు చోటు చేసుకుంది. అదేంటీ ప్రపంచ గిన్నిస్ రికార్డు పుట్టిన రోజేంటనేగా మీ అనుమానం.. మీ అనుమానం నిజమే.. వారింట్లో అది నిజంగానే ప్రపంచ గిన్నిస్ రికార్డు పుట్టిన రోజు పండుగే.. ఎందుకు.. ఎలా అంటారా? అయితే ఇది చదవండి..
Read also: BRO : సినిమాలో త్రివిక్రమ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం పుట్టినరోజు వేడుకలు గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ కుటుంబంలోని తొమ్మిది మంది పుట్టినరోజు ఒకేతేదీన కావడంతో ఆ ఘనత దక్కింది. పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం పుట్టినరోజు వేడుకలు ప్రపంచ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ కుటుంబంలోని తొమ్మిది మంది పుట్టినరోజు ఒకేతేదీన కావడంతో ఆ ఘనత దక్కింది. సింధ్ ప్రావిన్సులోని లర్కానా నగరానికి చెందిన అమీర్ అలి, ఖదీజా దంపతులకు 1992 ఆగస్టు 1న మొదటిపాప పుట్టింది. తర్వాత వరుసగా ఆరుగురు సంతానం అదే తేదీన పుట్టడం విశేషం. ఇలా ఏడుగురు తోబుట్టువుల పుట్టినరోజు ఒకే తేదీన రాగా.. అమీర్, ఖదీజా దంపతుల పుట్టినరోజు, పెళ్లిరోజు సైతం అదే తేదీన కావడంతో.. ఆగస్టు 1 వచ్చిందంటే ఆ ఇంట్లో భారీ సంబరాలే. ఈ పాకిస్థానీ కుటుంబం ‘గిన్నిస్’ గుర్తింపు సాధించింది. గతంలో అమెరికాకు చెందిన కమిన్స్ కుటుంబం పేరిట ఫిబ్రవరి 20న పుట్టిన అయిదుగురు పిల్లలతో ఈ గిన్నిస్ రికార్డు ఉండేది. ఇపుడు అదికాస్త చెరిపివేసి పాకిస్థానీ కుటుంబం ఏకంగా 9 మంది ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటూ ప్రపంచ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు.
