Site icon NTV Telugu

ఇండోనేషియాలో సునామీ హెచ్చరిక జారీ

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ సముద్ర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలోఈ భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా ప్రభుత్వం తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని (GFZ) జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.

ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో డిసెంబర్ 26, 2004న 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీకి దారి తీసింది. దీని కారణంగా ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్‌తో పాటు తొమ్మిది దేశాలలో 230,000 లక్షల మంది చనిపోయారు.

Exit mobile version