Google Fires A HR During A Call With Candidate: అంతర్జాతీయంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న గూగుల్.. అందులో భాగంగానే క్రమంగా ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తోంది. రీసెంట్‌గా భార్యాభర్తలకు ఒకేసారి లేఆఫ్ ఇచ్చిన ఈ దిగ్గజ సంస్థ.. ఇప్పుడు ఓ హెచ్‌ఆర్‌కి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో.. హెచ్ఆర్ సిబ్బందిలో పని చేస్తున్న ఒకరికి లేఆఫ్ మెయిల్ వచ్చింది. ఈ కంపెనీకి మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు, ఇకపై మీరు ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. ఆ ఉద్యోగిని సంస్థ నుంచి తొలగించినట్టు ఓ వార్తా సంస్థ కథనం పేర్కొంది.
CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ఆ హెచ్‌ఆర్ పేరు డాన్ లానిగాన్ ర్యాన్. గూగుల్‌లో రిక్రూట్‌మెంట్ విభాగంలో పని చేస్తున్న ర్యాన్.. ఫోన్‌లో ఒకరిని ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇంతలో ఆ కాల్ ఒక్కసారిగా కట్ అయ్యింది. దీంతో ఆ ఉద్యోగి ఖంగుతిన్నారు. అసలేం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. దీంతో తనకు అనుమానం వచ్చి.. గూగుల్‌కి చెందిన ఓ వెబ్‌సైట్‌లో లాగిన అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ.. లాగిన్ అవ్వలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తొలుత ఏమైనా సాంకేతిక లోపం కారణంగా లాగిన్ అవ్వడానికి వీలు పడట్లేదేమోనని ర్యాన్ అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆ ఉద్యోగికి ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్ సందేశం వచ్చింది. దాంతో ర్యాన్ అర్థాంతరంగా సంస్థ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. నిజానికి.. తనకు రీసెంట్‌గానే మరో ఏడాదికి కాంట్రాక్టును పొడిగించారని, జీతం గురించి చర్చలు కూడా జరిగాయని, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ర్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Kodali Nani: లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు
కాగా.. ఇటీవలే ఓ జంటను సైతం గూగుల్ సంస్థ ఇలాగే అర్థాంతరంగా ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. అలీ ఈ సంస్థలో గత ఆరేళ్లుగా పని చేస్తుండగా.. బీగన్ నాలుగేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాడు. నాలుగు నెలల క్రితమే వీరికి ఒక బిడ్డ జన్మనిచ్చింది. ఆ బిడ్డ కోసం అలీ మెటర్నిటీ లీవ్ తీసుకొని, ఇంట్లోనే ఉంటోంది. బీగన్ అప్పుడు సెలవులు పెడుతూ, సంస్థకు వెళ్తుండేవాడు. కానీ.. లేఆఫ్స్‌లో భాగంగా గూగుల్ వారిని తొలగిస్తూ, ఒక మెయిల్ పంపింది. అది చూసి వాళ్లు షాక్ అయ్యారు. తమ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు