అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చల దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. బుధవారం ‘న్యూయార్క్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో ఇరాన్‌తో రెండవ విడత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ శుక్రవారం నాటికి దీనికి సంబంధించి ఒక “శుభవార్త” అందవచ్చని ట్రంప్ స్వయంగా పేర్కొనడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కాల్పుల విరమణ పొడిగింపు
ఇరాన్ ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసినప్పటికీ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో ట్రంప్ అమెరికా విధిస్తున్న కాల్పుల విరమణను పొడిగించారు. ఇరాన్ ప్రస్తుతం అంతర్గత రాజకీయ సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం విచ్ఛిన్నమైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం..
ఈ చర్చల పునరుద్ధరణలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇరాన్ నాయకులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు ఈ విరామం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
