Site icon NTV Telugu

హెచ్చ‌రికః వ్యాక్సిన్ తీసుకోకుంటే అరెస్ట్ త‌ప్ప‌దు…

క‌రోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు.  వ్యాక్సిన్ విష‌యంలో కొన్ని దేశాలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.  అలాంటి దేశాల్లో ఫిలిపిన్స్ కూడా ఒక‌టి.  ఆ దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అమ‌లుచేస్తున్నారు.  అర్హులైన ప్ర‌తి ఒక్కరూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, ఒక‌వేళ వ్యాక్సిన్ తీసుకోక‌పోతే అరెస్ట్ లు త‌ప్ప‌వ‌ని అధ్య‌క్షుడు రోడ్రిగో హెచ్చ‌రించారు.  అరెస్ట్ వ‌ర‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని కోరారు.  ఒక‌వేళ ఎవ‌రికైనా వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఇష్టం లేకుంటే దేశం విడిచి వెళ్లిపోవాల‌ని అధ్య‌క్షుడు రోడ్రిగో హెచ్చ‌రించారు. అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. 

Read: చేప క‌డుపులో పుల్ విస్కీబాటిల్ః సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…

Exit mobile version