NTV Telugu Site icon

జీ7 కీల‌క నిర్ణ‌యంః మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా ఉండేందుకు… 100 రోజుల్లోనే…

జీ 7 దేశాల స‌ద‌స్సు బ్రిట‌న్‌లో జ‌రుగుతున్న‌ది.  జీ7 స‌భ్య‌దేశాల అధినేత‌లు ఆ స‌ద‌స్సులో పాల్గోన్న సంగి తెలిసిందే.  ప్ర‌స్తుతం క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్న త‌రుణంలో ఎదుర్కొంటున్న స‌మస్య‌ల‌పై, మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఈ స‌ద‌స్సులో చ‌ర్చిస్తున్నారు.  ఇక‌, ఇలాంటి మ‌హమ్మారులు భ‌విష్య‌త్తులు ఎదురైతే ఎక్కువ‌స‌మ‌యం తీసుకోకుండా 100 రోజుల్లోనే మ‌హ‌మ్మారుల‌కు చెక్ పెట్టేందుకు అనుగుణంగా స‌మ‌ర్ధ‌వంత‌మైన టీకాల‌ను అభివృద్ది చేయాల‌ని స‌భ్య‌దేశాలు నిర్ణ‌యం తీసుకున్నాయి.  18 నెల‌ల కాలంలో తెలుసుకున్న అనుభ‌వాల దృష్ట్యా స‌భ్య‌దేశాలు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి.  ఇక‌, క‌రోనా తొలిద‌శ‌లో చైనా విష‌యాన్ని దాచిపెట్ట‌డంపై జీ7 దేశాలు విరుచుకుప‌డ్డాయి.  అయితే, చైనాను మ‌రింత క‌ట్ట‌డి చేసేందుకు అమెరికా ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌క‌టించ‌గా దానికి కెన‌డా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాలు మ‌ద్దుతు తెలిపాయి.  జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, ఇట‌లీ దేశాలు త‌మ మ‌ద్ద‌తును తెల‌పాల్సి ఉన్న‌ది.