Site icon NTV Telugu

జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎంగా రెండోసారి ఫ్యూమియో కిషిడా

జపాన్‌ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిదా మళ్లీ ఎన్నికయ్యారు. నిన్న జరిగిన ఓటింగ్​లో.. ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు పార్లమెంట్​ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో కొత్తగా ఎన్నికైన సభ్యులతో కేబినెట్​ను ఏర్పాటు చేయనున్నారు. ఐతే నెల రోజుల క్రితమే ప్రధానిగా ఎన్నికైన కిషిడా.. పార్లమెంట్ దిగువసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కిషిదా ప్రాతినిధ్యం వహిస్తున్న…లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ..దిగువ సభలో 261 సీట్లు సాధించింది. దీంతో కిషిదా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగింది.

Exit mobile version