Site icon NTV Telugu

చేప క‌డుపులో పుల్ విస్కీబాటిల్ః సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…

ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది స‌ముద్రంపై ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తుంటారు.  స‌ముద్రంలో దొరికే చేప‌ల‌ను ప‌ట్టుకొని జీవిస్తుంటారు.  అయితే, ప్ర‌తిరోజూ స‌ముద్రంలో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని అనుకోకూడ‌దు.  ఒక్కోసారి అదృష్టం అలా క‌లిసి వ‌స్తుంది.  నిత్యం స‌ముద్రంలో చేప‌లు ప‌ట్టుకొని జీవించే ఓ మ‌త్స్య‌కారుడి వ‌ల‌కు ఓ పెద్ద చేప దొరికింది.  ఆ చేప‌ను ప‌డ‌వ‌లోని బ‌ల్ల‌పై ఉంచి క‌త్తిలో కోశాడు.  చేప క‌డుపులో చేయిపెట్టి శుభ్రం చేస్తుండ‌గా అత‌డికి ఓ బాటిల్ దొరికింది.  దాన్ని చూసి మ‌త్స్య‌కారుడు షాక్ అయ్యాడు. ఫుల్ విస్కి బాటిల్ కావ‌డంతో ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.  దీనికి సంబందించిన వీడియోను టిక్‌టాక్ యూజ‌ర్ బెనిబాన్ షేర్ చేయ‌డంతో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.  ఆరు మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ సాధించింది. 

Read: ‘ఆహా’లో ఈ వారం ఒకటి కాదు రెండు!

Exit mobile version