Site icon NTV Telugu

French: ఫ్రెంచ్‌లో రాజకీయ సంక్షోభం.. విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో ఓటమి

Frenchpm

Frenchpm

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఫ్రాన్స్‌లోనే పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశ రుణాన్ని తగ్గించడానికి సుమారు 52 బిలియన్లను తగ్గించాలనే ప్రణాళికలపై ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జాతీయ అసెంబ్లీ ఓటు వేసింది. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో 364 మంది డిప్యూటీలు ప్రభుత్వంపై తమకు అవిశ్వాసం లేదని ఓటు వేయగా.. కేవలం 194 మంది మాత్రమే తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో పదవీచ్యుతుడయ్యారు.

ఇది కూడా చదవండి: PM Modi: నేడు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో మోడీ పర్యటన.. వరద ప్రాంతాల పరిశీలన

ఫ్రాన్స్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా కాకుండా విశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడైన తొలి ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో కావడం విశేషం. ఇక మంగళవారం ఉదయం తన రాజీనామాను సమర్పించనున్నట్లు అత్యంత సన్నిహితుడొకరు మీడియాకు తెలిపాడు.

ఇది కూడా చదవండి: Urmila : 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘రంగీలా’.. ఊర్మిళ ఎమోషనల్ పోస్ట్

కేవలం తొమ్మిది నెలలు మాత్రమే బేరో ప్రధాని పదవిలో ఉన్నారు. పొదుపు బడ్జెట్‌పై విశ్వాస పరీక్షకు వెళ్లి లేనిపోని తంటా తెచ్చుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రకారం.. ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో రాజీనామాను సమర్పించాలని స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ హయాంలో బేరౌ ఆరవ ప్రధానమంత్రిగా ఉన్నారు. తాజాగా బేరో ప్రభుత్వం కూలిపోవడంతో మాక్రాన్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓ వైపు ఉక్రెయిన్ యుద్ధంపై తలమునకలవుతున్న తరుణంలో సంక్షోభం తలెత్తడంతో ఫ్రాన్స్‌లో గందరగోళం నెలకొంది. మరొక వారసుడిగా కోసం మాక్రాన్ వేట ప్రారంభించాల్సి వస్తోంది. రాజీ కుదరుస్తారా? లేదంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అన్నది సందిగ్ధం నెలకొంది.

ఇక విశ్వాస పరీక్షను ప్రధాని బేరో సమర్థించారు. ఫ్రాన్స్‌కు అప్పుల కుప్ప ప్రాణాంతకం అని అభివర్ణించారు. దేశాన్ని అప్పుల కుప్ప నుంచి తప్పించడం కోసమే తమ ప్రభుత్వం పొదుపు బడ్జెట్‌ను తీసుకొచ్చిందని వివరించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అధికారం ఉంది కానీ.. వాస్తవాన్ని తుడిచిపెట్టే అధికారం లేదని బేరౌ అన్నారు. ఓటింగ్‌కు ముందు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం రాబట్టలేకపోయారు.

ఇక అధ్యక్షుడు మాక్రాన్ కూడా విశ్వాసాన్ని కోల్పోయారు. మాక్రాన్‌పై కూడా తీవ్ర వ్యతిరేక ఉంది. దాదాపు 64 శాతం మంది ప్రజలు కొత్త ప్రధానమంత్రిని ప్రకటించడానికి బదులుగా మాక్రాన్ రాజీనామా చేయాలని కోరుకుంటున్నాని లె ఫిగరో వార్తాపత్రిక కోసం ఓడోక్సా-బ్యాక్‌బోన్ నిర్వహించిన పోల్‌లో తేలింది. ఔయెస్ట్-ఫ్రాన్స్ దినపత్రిక కోసం నిర్వహించిన ఐఫాప్ పోల్ ప్రకారం.. దాదాపు 77 శాతం మంది ప్రజలు మాక్రాన్‌కు ఆమోదం లభించలేదని పేర్కొంది. కానీ ఈ చర్యను మాక్రాన్ తోసిపుచ్చారు. ఇక 2027లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈసారి ఫ్రెంచ్ తీవ్రవాద పార్టీ గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

Exit mobile version