France:యూరోపియన్ దేశం ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లౌకిక, ఉదారవాదానికి విలువనిచ్చే అక్కడి ప్రభుత్వం సంప్రదాయ ముస్లిం వస్త్రధారణపై నిషేధం విధించింది. ఫ్రాన్స్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ముస్లిం అబయా వస్త్రాలను నిషేధించింది. కొంత మంది ముస్లిం మహిళలు వదులుగా ఉండే, పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే, అబయా అని పిలువబడే దుస్తులను ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధిస్తున్నట్లు ఆ దేశ విద్యామంత్రి ఆదివారం తెలిపారు.
Read Also: Bengaluru: మరో శ్రద్ధావాకర్ తరహా ఘటన.. ప్రెషర్ కుక్కర్‌తో హత్య..
ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముస్లిం యువతులు ఈ రకం వస్త్రధారణ లేకుండా స్కూళ్లకు హాజరుకావల్సి ఉంది. 19వ శతాబ్ధంలో ఫ్రాన్స్ చేసిన చట్టాలు ఆ దేశంలోని స్కూళ్లలో విద్య నుంచి సాంప్రదాయ కాథలిక్ ప్రభావాన్ని తొలగించింది. పాఠశాలల్లో మతాన్ని సూచించే సంకేతాలపై కఠిన వైఖరి అవలంభిస్తోంది. అయితే ముస్లిం మైనారిటీని మత సంప్రదాయాలను నెమ్మదిగా తొలగిస్తూవస్తోంది.
2004లో పాఠశాలల్లో తలకు చుట్టుకునే కండువాలను నిషేధించింది. 2010లో పూర్తిగా ముఖాన్ని కప్పుకోవడాన్ని నిషేధించింది. అయితే అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఐదు మిలియన్ల ముస్లిం వర్గానికి కోపం తెప్పించింది. తాజాగా అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఇదే విధంగా ఉంది. ‘పాఠశాలల్లో ఇకపై అబయా ధరించరాదని నేను నిర్ణయించుకున్నానని’ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు తరగతి గదిలోకి వెళ్లినప్పుడు, విద్యార్థులను చూడటం ద్వారా వారి మతాన్ని గుర్తించలేరని మంత్రి అన్నారు.