NTV Telugu Site icon

Syria-France: సిరియాలోని ఐసిస్ స్థావరాలపై ఫ్రాన్స్ దాడులు.. ఇద్దరు మృతి

Isis

Isis

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గత వారం ఫ్రాన్స్ క్షిపణి దాడులు నిర్వహించిందని ఫ్రెంచ్ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను మంగళవారం తెలిపారు. సిరియాలో అమెరికా ఇదే విధమైన సైనిక దాడి తర్వాత ఫ్రెంచ్ వైమానిక దాడి చేసిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. సిరియాలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదం పుంజుకోకుండా కట్టడి చేస్తామని పేర్కొన్నారు.

ఆదివారం ఫ్రెంచ్ వైమానిక దళాలు.. సిరియన్ భూభాగంలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడుల చేసినట్లు వెల్లడించారు. అమెరికా చేసిన దాడిని అనుసరించి.. ఈ దాడులు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు.

ఇది కూాడా చదవండి: Russia-Ukrain: న్యూఇయర్ వేళ ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు

ఇటీవల సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నారు. దీంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సిరియాను వదిలిపెట్టి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం రష్యాలో అసద్ రాజకీయ శరణార్థిగా ఉన్నారు. దీంతో సిరియాలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. రెబల్స్ దాడి చేసే సమయంలో మిత్రదేశాలైన ఇరాన్, రష్యా హ్యాండిచ్చాయి. ఎలాంటి సహకారం అందించలేదు. దీంతో అసద్ పారిపోయాడు. ప్రస్తుతం సిరియాలో మొహమ్మద్ అల్ బషీర్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదిలా ఉంటే సిరియాతో ఉక్రెయిన్ సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వారి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నడిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూాడా చదవండి: December 2024 Movie Roundup: అల్లు అర్జున్ అరెస్ట్.. మంచు కుటుంబంలో పెనువివాదం

Show comments