Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. దేశ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల మంగళవారం అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ పై పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. ఇందులో తోషఖానా కేసుతో పాటు ఉగ్రవాద చర్యలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై పాక్ ఆర్మీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో లాహోర్ లోని అతడి నివాసంలో అరెస్ట్ చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఆ సమయంలో అతని మద్దతుదారులు, పోలీసులకు మధ్య తీవ్ర హింసాత్మక ఘర్షణలు ఏర్పడ్డాయి.
అవినీతి కేసులో మిస్టర్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న వీడియో పాకిస్తాన్ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆయన్ను చుట్టుముట్టిన పారామిలిటరీ సిబ్బంది నెట్టెస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘‘ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా నెట్టారు, పాక్ ప్రజలారా.. ఇది దేశాన్ని రక్షించుకునే సమయంల, మీకు మరో అవకాశం లభించదు’’ అని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ పిలుపునిచ్చింది. కోర్టులో హాజరయ్యే ముందు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తనపై ఏ కేసు లేదని, తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు తాను సిద్ధమే అని ఆయన అన్నారు.
Read Also: Foxconn: బెంగళూర్‌లో భారీ ధరతో భూమి కొనుగోలు చేసిన ఐఫోన్ మేకర్..
ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమీర్ ఫరూక్, ఇస్లామాబాద్ పోలీసు చీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మరియు అదనపు అటార్నీ జనరల్‌ను 15 నిమిషాలలోగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించినట్లు పాక్ ప్రముఖ మీడియా డాన్ నివేదించింది. తాను సంయమనం ప్రదర్శిస్తున్నాడని, ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్ కోర్టుకు హాజరుకాకపోతే తాను ప్రధాని మంత్రిని పిలిపిస్తానని హెచ్చరించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇమ్రాన్ ఖాన్ ను ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో కోర్టుకు వచ్చి చెప్పండి అని ఆదేశాలు జారీ చేశారు.
ఇస్లామాబాద్ ను పాక్ రేంజర్లు ఆక్రమించారు, న్యాయవాదుల్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కారును చుట్టుముట్టారు అని ఆయన సహాయకుడు, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకుడు ఫవాద్ చౌదరి ఉర్దూలో ట్వీట్ చేశారు. పాకిస్తాన్ అంతటా తక్షనమే నిరసనలు ప్రారంభించాలని ప్రజలకు పిలునిచ్చారు. కోర్టు ఆవరణలోనే ఇమ్రాన్ ఖాన్ న్యాయవాదిని తీవ్రంగా కొట్టారని, ఆయన చొక్కాపై ఉన్న రక్తపు మరకల్ని పీటీఐ ట్వీట్ చేసింది.
#WATCH | "Pakistan Rangers abducted PTI Chairman Imran Khan," tweets Pakistan Tehreek-e-Insaf (PTI)
(Video source: PTI's Twitter handle) pic.twitter.com/ikAS2Pxlpw
— ANI (@ANI) May 9, 2023
