NTV Telugu Site icon

Shnizo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు.. పరిస్థితి విషమం

Japan Former Pm Shinzo Abe

Japan Former Pm Shinzo Abe

జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. నారా నగరంలో జరిగిన ఓ బహిరంగ సభలో షింజో ప్రసంగిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో మాజీ ప్రధాని తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ గాయాలతో రక్తమోడుతూ కనిపించారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నారా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే ఆయన వేదిక మీదే కుప్పకూలిపోయారు. సంఘటన జరిగిన వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Car Washed Away: నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి, 5గురు గల్లంతు

“జపాన్ మాజీ ప్రధాని షింజో వెస్టరన్ జపాన్‌లోని నారా సిటీలో ఓ సభలో ప్రసంగిస్తుండగా కుప్పకూలారు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం.. గాయమైనట్లు తెలుస్తుంది. గన్ షాట్ లాంటి శబ్దం వినిపించింది. ఆ తర్వాత కిందపడిన అతనికి రక్తం కారుతుంది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు” అని ఎన్​హెచ్​కే రిపోర్టర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక 2006-2007, 2012-20 రెండు పర్యాయాలు జపాన్‌ ప్రధానిగా షింజో అబే సేవలు అందించారు.