NTV Telugu Site icon

Snowfall: ఎడారి దేశంలో భారీ హిమపాతం.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు

Snowfall2

Snowfall2

దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో సౌదీ అరేబియాలో వింతైన దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా తెల్లని మంచుతో కప్పబడింది. ఏకధాటిగా ఎడారిలో మంచు కురవడంతో తెల్లటి దుప్పటిలా కనిపిస్తోంంది. ఈ అందమైన దృశ్యాలతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సౌదీ అరేబియాలో ఒక్కసారిగా భారీ హిమపాతం కురవడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ ఘటనతో ఆలోచనలో పడ్డారు. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలు మొదటిసారిగా భారీ వర్షాలు, హిమపాతం ముంచెత్తాయి. స్థానిక మీడియా ప్రకారం… అల్-జాఫ్ ప్రాంతంలో భారీ మంచు కురుస్తోంది. అల్-జాఫ్ ప్రాంతం ఏడాది పొడవునా శుష్క వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత పరిస్థితుల్ని చూసి స్థానిక నివాసితులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రయాణాలు చేసే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానులకు తోడు బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. గత శనివారం విపరీతంగా మంచు కురిసింది. కొన్ని ప్రాంతాలు తెల్లని మంచుతో కప్పి ఉన్నాయి. దీంతో పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. ప్రజలు ఉల్లాసంగా గడుపుతూనే.. ఇదేమీ వింత అంటూ ఆశ్చర్యపోతున్నారు.