Snowfall: ఎడారి దేశంలో భారీ హిమపాతం.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
- ఎడారి దేశంలో భారీ హిమపాతం
- ఆశ్చర్యపోతున్న ప్రజలు.. శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో సౌదీ అరేబియాలో వింతైన దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా తెల్లని మంచుతో కప్పబడింది. ఏకధాటిగా ఎడారిలో మంచు కురవడంతో తెల్లటి దుప్పటిలా కనిపిస్తోంంది. ఈ అందమైన దృశ్యాలతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read
సౌదీ అరేబియాలో ఒక్కసారిగా భారీ హిమపాతం కురవడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ ఘటనతో ఆలోచనలో పడ్డారు. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలు మొదటిసారిగా భారీ వర్షాలు, హిమపాతం ముంచెత్తాయి. స్థానిక మీడియా ప్రకారం… అల్-జాఫ్ ప్రాంతంలో భారీ మంచు కురుస్తోంది. అల్-జాఫ్ ప్రాంతం ఏడాది పొడవునా శుష్క వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత పరిస్థితుల్ని చూసి స్థానిక నివాసితులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రయాణాలు చేసే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానులకు తోడు బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. గత శనివారం విపరీతంగా మంచు కురిసింది. కొన్ని ప్రాంతాలు తెల్లని మంచుతో కప్పి ఉన్నాయి. దీంతో పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. ప్రజలు ఉల్లాసంగా గడుపుతూనే.. ఇదేమీ వింత అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Capturing the blend of sand and hail, these photos from the Ha'il-Rafha road, taken on Saturday afternoon in 2024.
📸Hamad Al-Saloom. pic.twitter.com/UaGwKmKVQ3
— Najdi Memoirs (@NajdiMemoirs) November 3, 2024
Also this snow, these pictures and clips were taken in the Al-Jawf area, specifically Dumat Al-Jandal North of the Arab Kingdom of Saudi Arabia 2024.❄️ pic.twitter.com/zIhcS6vJaq
— دوشا الشمري.🇸🇦 (@id7is) November 3, 2024
🇸🇦 Suudi Arabistan’ın çöllük Al-Jawf bölgesinde kar ❄️ ve tipi.pic.twitter.com/to6Sl3jIs7
— Dr. Ali Demirdas (@DrDemirdasEn) November 3, 2024
తాజావార్తలు
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!