Site icon NTV Telugu

వాల్ట్‌ డిస్నీ చైర్మన్‌గా తొలిసారి మహిళ

ప్రపంచ వ్యాప్తంగా వాల్ట్‌ డీస్నీ సంస్థ చైర్‌పర్సన్‌గా తొలిసారిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. మేనేజ్‌మెంట్‌, ఆర్థిక, సౌందర్య ఉత్పత్తుల రంగాల్లో అపార అనుభవజ్ఞురాలైన 67 ఏళ్ల సూసన్‌ అర్నాల్డ్‌ త్వరలో పదవిని స్వీకరించనున్నారు. 14 ఏళ్లుగా డీస్నీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. గతంలో ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ అయిన కార్లైల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సుసేన్‌ఆర్నాల్డ్ 2018 నుండి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె మెక్‌డొనాల్డ్స్ మరియు NBTYలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆమె ఈ నెల 31న బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇగెర్ తన పదవీ కాలంలో సంపాదించిన మార్వెల్ మరియు స్టార్ వార్స్ వంటి బ్రాండ్‌ల ప్రజాదరణకు వచ్చిన క్రేజ్‌ను డీస్నీ సంస్థ ఉపయోగించుకొనుంది. స్ట్రీమింగ్ వ్యాపారంవృద్ధి , కోవిడ్‌ మహమ్మారి కారణంగా పార్క్‌గోయర్లు, చలనచిత్ర ప్రేక్షకులు తగ్గడంతో డిస్నీ షేర్లు ఈ ఏడాది ఏకంగా 22 శాతం పడిపోయాయి. అమెరికాలో కాలిఫోర్నియాలో స్థాపించిన వాల్ట్‌ డీస్నీ.. ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, టెలివిజన్‌, థీం పార్కుల యానిమేషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Exit mobile version