విశాలమైన ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. మనిషి ఒంటరి జీవి కాదని, విశ్వంలో మరో జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. దీనికోసం అనేక ప్రాంతాల్లో రేడియో రిసీవింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా సుమారు నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత నుంచి రేడియో తరంగాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. ప్రతి 18 నిమిషాలకు ఒకసారి ఈ రేడియో తరంగాలు రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, రేడియో తరంగాలను విడుదల చేస్తున్న వస్తువును ఇప్పటి వరకు గుర్తించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రేడియో తరంగాలు ఏదైన నక్షత్రం నుంచి వస్తున్నాయా లేదంటే మరేదైనా వస్తువు నుంచి వస్తున్నాయా అనే దానిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను నేచర్ అనే పత్రికలో ప్రచురించారు.
అంతరిక్షం నుంచి రేడియో సిగ్నల్స్… ప్రతి 18 నిమిషాలకొకసారి…
