NTV Telugu Site icon

Congo: కాంగోలో వరద విలయం.. 120 మంది దుర్మరణం

Congo Floods

Congo Floods

Floods kill at least 120 in DRC capital Kinshasa: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ఆఫ్రికా దేశం అతలాకుతలం అవుతోంది. కాంగో రాజధాని కిన్షాసాలో రాత్రంతా కురిసిన వర్షం వల్ల చరిత్రలో ఎప్పుడూ లేని వరదలు వచ్చాయి. దీంతో జనజీవితం స్తంభించిపోయింది. దాదాపుగా 1.5 కోట్ల జనాభా ఉన్న కన్షాసా వరదల వల్ల దెబ్బతింది. నగరంలోని ప్రధాన రహదారులు మునిగిపోయాయి. వరదలు, భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 120 మంది మరణించారు. రాజధాని కిన్షాసాను ఇతర ప్రాంతాలతో కలిపే రోడ్లు వరద నీటితో మునిగిపోయాయి. అక్కడి ఆరోగ్య మంత్రి జీన్ జాక్వెస్ మాట్లాడుతూ.. మొత్తంగా భారీ వరదల వల్ల 141 మంది మరణించినట్లు వెల్లడించారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.

Read Also: Cisco: టెక్కీలకు షాక్.. ఉద్యోగుల తొలగింపు ప్రారంభించిన సిస్కో..

కాంగో నది ఒడ్డున మత్స్యకార గ్రామంగా ఉన్న కిన్షాసా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ.. 1.5 కోట్ల జనాభాతో ఆఫ్రికాలోనే మెగాసిటీలలో ఒకటిగా ఎదిగింది. పట్టణీకరణం, ఇబ్బదిముబ్బడిగా నది చుట్టూ నిర్మాణాలు జరగడంతోనే వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. పట్టణీకరణం, వాతావరణ మార్పుల కారణంగా తరుచుగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నట్లు పర్యావరణవేత్తలు తెలుపుతున్నారు. దీనివల్లే కన్షిసా సిటీ వరదలతో అల్లాడుతోంది. 2019 నవంబర్ లో కిన్షాసా వరదల వల్ల కొండచరియలు విరిగిపడి 40 మంది చనిపోయారు. నగరంలోని మోంట్-నగఫులా భారీగా దెబ్బతింది. ఈ స్థాయిలో వరదలు ఎప్పుడూ చూడలేదని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.