Site icon NTV Telugu

Indonesia Floods: ఇండోనేషియాలో జల విలయం.. 442 మంది మృతి

Indonesia Floods

Indonesia Floods

ఆగ్నేయాసియాలో తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక అతలాకుతలం అయ్యాయి. ఇక ఇండోనేషియాపై భారీ జలఖడ్గం విరుచుకుపడింది. కుండపోత వర్షాలతో సుమత్రా ద్వీపాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలతో ఇప్పటి వరకు 442 మంది చనిపోగా.. వందలాది మంది తప్పిపోయారు. ఇక లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

అసాధారణమైన సెన్యార్, దిత్వా తుఫానులు ఆగ్నేయాసియా అంతటా విధ్వంసం సృష్టించాయి. థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక‌, ఇండోనేషియా దేశాలు హడలెత్తిపోయాయి. శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 193 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక థాయ్‌లాండ్‌లో 145 మంది చనిపోయారు. ఇలా ఆగ్నేయాసియాలో తుఫాన్లు కారణంగా జలప్రళయం బీభత్సం సృష్టించి వందిలాది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గల్లంతయ్యారు. వివప్తు బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.

భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ దెబ్బతిన్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం వందలాది మంది తప్పిపోయినట్లుగా కథనాలు వస్తున్నాయి. సెన్యార్ తుఫాను కారణంగా ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడటం, వరదలకు ఇళ్ళు కొట్టుకుపోయాయని, అలాగే వేలాది భవనాలు మునిగిపోయాయని అధికారులు తెలిపారు.

Exit mobile version