NTV Telugu Site icon

Flight Accident: రన్‌వేపై ఓ విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Flight

Flight

Flight Accident:గత పది రోజుల్లో వరుస విమాన ప్రమాదాలు జరగడం తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ విమానం రన్‌వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ కావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ భయపడి ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని పైలట్‌ను హెచ్చరికలు జారీ చేశాడు. అయితే, వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందిన గోంజగ విశ్వ విద్యాలయం మెన్స్ బాస్కెట్ బాల్ టీమ్ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ రన్‌వేపై ఉండగా ఈ ఘటన నెలకొంది. అయితే, క్షణంలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: KTR Tweet: పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా?.. కేటీఆర్ ట్వీట్ వైరల్!

అయితే, శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేస్తుంది. లాస్ ఏంజిల్స్ లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆ సమయంలో రన్‌వే నుంచి రెండో విమానం టేకాఫ్ అవుతుండడంతో రన్‌వేని దాటకుండా ఉండాలని బాస్కెట్ బాల్ టీమ్ సభ్యులున్న ‘కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563’ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఆదేశాలు ఇచ్చారు. కానీ, అదే సమయంలో ఎంబ్రేయర్ ఈ135 విమానం టేకాఫ్ కావడంతో అలర్టైన సిబ్బంది స్టాప్, స్టాప్, స్టాప్ అంటూ ప్రైవేట్ క్యారియర్‌ పైలట్‌కు హెచ్చరించడంతో.. పెను ప్రమాదం తప్పింది. దీంతో మొదటి విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిందని అధికారులు చెప్పుకొచ్చారు.

Show comments