NTV Telugu Site icon

Covid 19: ఉత్తర కొరియాలో తొలి కరోనా మరణం.. వేగం పుంజుకున్న కరోనా

North Korea

North Korea

ఉత్తర కొరియా అంటేనే మిస్టరీ దేశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా వెలుగు చూడలేదు. నిజానికి కరోనా కేసులు నమోదైనా కూడా తమ దేశంలో ఒక్క కేసు కూడా రాలేదని కిమ్ ప్రభుత్వం గొప్పలకు పోయింది. అయితే తాజాగా ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైన కొన్ని గంటల్లోనే ఆ దేశంలో తొలి కరోనా మరణం కూడా సంభవించింది. ప్యాంగాంగ్‌లో తాజాగా జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మృతుడిలో ఒమిక్రాన్‌ బీఏ 2 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు.

North Korea: ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

మరోవైపు ఉత్తర కొరియా వ్యాప్తంగా 1.87 లక్షల మంది ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి అధికారులు చికిత్స అందిస్తున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో లాక్‌డౌన్ విధించారు. జ్వరం కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నప్పటికీ అవన్నీ కరోనా కేసులే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర కొరియాలో ఇంకా క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. టీకాలు ఇస్తామ‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా ఉత్తర‌కొరియా గతంలో తిర‌స్కరించింది.