Site icon NTV Telugu

నడి సముద్రంలో భారీ అగ్నిప్రమాదం…

చుట్టూ ఎక్కడ చూసిన తీరం కనిపించనంత విశాలంగా విస్తరించిన సముద్రం. నట్ట నడిమిలో ఎగసిపడుతున్న మంటలు . చూడటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో .. అంతే భయంకరంగా కూడా ఉంది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని యూకాటన్‌ ద్వీపకల్పంలో పెమెక్స్‌ అనే చమురు సంస్థ ఉంది. ఆ కంపెనీ రోజు వారీగా దాదాపు 1.7 మిలియన్‌ బారెల్స్‌ చమురు ను ఉత్పత్తి చేస్తోంది. అయితే.. మెక్సికోలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల చమురు యంత్రాలు దెబ్బతిన్నాయి. అలాగే సముద్ర లోపలి నుంచి చమురును రవాణా చేసే పైప్‌లైన్‌ దెబ్బతింది.

read also : అన్యాయం జరిగితే ఊరుకోం.. ప్రాణాలు పోయినా పోరాటం..

దీంతో గ్యాస్‌ లీకై.. మంటలు అంటుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున 5:15 గంటలకు గ్యాస్ లీక్ జరిగి మంటలు చెలరేగాయని చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బంది.. నౌకలతో మంటలపై నీటిని చల్లి ఉదయం 10:30 గంటల వరకు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను పూర్తిగా ఆర్పివేయడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలను పరిశీలిస్తామని సిబ్బంది తెలిపారు. మంటలను నియంత్రించడానికి నత్రజనిని ఉపయోగించినట్లు నౌకా సిబ్బంది తెలిపారు.

Exit mobile version