NTV Telugu Site icon

చైనా పాఠ‌శాల‌లో అగ్నిప్ర‌మాదం…18 మంది మృతి…

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని షాంగ్‌కియు న‌గ‌రంలో ఉన్న సెంట్ర‌ల్ మార్ష‌ల్ ఆర్ట్స్ పాఠ‌శాల‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది.  ఈ ప్ర‌మాదంలో 18 మంది మ‌ర‌ణించ‌గా, 16 మందికి గాయాల‌య్యాయి.  గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్ర‌మాదానికి కార‌ణాలు ఎంటి అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది.  ఇటీవ‌ల కాలంటో చైనాలో ఇలాంటి మ‌ర‌ణాలు వ‌ర‌స‌గా జ‌రుగుతున్నాయి.  అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు.