Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Fire Accident At Egyptican Coptic Church 41 Members Died

Egypt Church Fire: ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది దుర్మరణం

Published Date :August 14, 2022 , 6:40 pm
By NTV WebDesk
Egypt Church Fire: ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది దుర్మరణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fire Accident At Egyptican Coptic Church 41 Members Died: ఈజిప్టు రాజధాని కైరోలోని అబు సిఫైనే చర్చిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం చెందగా.. 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటో ఇంకా స్పష్టంగా వెలుగులోకి రానప్పటికీ.. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్​కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, మంటల్ని అదుపు చేసింది.

ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాప్టిక్ క్రిస్టియన్ చర్చి పోప్ తవాడ్రోస్-2కి ఫోన్ చేసి ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ శాఖల్ని ఆదేశించారు. కాగా.. ఈ చర్చి కాప్టిక్ ప్రజలకు చెందినది. మధ్యప్రాచ్యంలో ఈ కాప్టిక్ వర్గానికి అతిపెద్ద క్రైస్తవ సామాజికవర్గంగా పేరుంది. ఈజిప్టులో మొత్తం 10.3 కోట్ల జనాభా ఉండగా.. అందులో కోటి మందికి పైగా కాప్టిక్ క్రైస్తవులు ఉన్నారు. అయితే.. ఈజిప్ట్‌లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండటంతో, క్రిస్టియన్లను టార్గెట్ చేసుకొని వరుస దాడులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి.

గతంలో వాళ్లు క్రైస్తవులకు సంబంధించిన ఇతర చర్చిలతో పాటు పాఠశాలలు, ఇళ్లను తగలబెట్టినట్టు కథనాలున్నాయి. ఇక ఈజిప్ట్ ప్రెసిడెంట్ సిసి ఇటీవలే రాజ్యాంగ న్యాయస్థానానికి నాయకత్వం వహించడానికి కాప్టిక్ న్యాయమూర్తిని నియమించిన తర్వాత.. చాలా ప్రాంతాల్లో అల్లర్లు కూడా జరిగాయి. ఓ కాప్టిక్ న్యాయమూర్తిని నియమించడం.. ఈజిప్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరిణామాల క్రమంలోనే అబూ సెఫైన్ చర్చిలో మంటలు చెలరేగడంతో.. ఈ ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Church Fire Incident
  • Coptic Church Fire Accident
  • Egypt Church Fire
  • Egyptican Coptic Church

తాజావార్తలు

  • Women’s Day 2026:జగతికి జీవం పోసిన జోలాపాటకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

  • Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..

  • International Women’s Day: అమ్మ నుంచి అర్ధాంగి వరకు.. సృష్టికి మూలం స్త్రీ.. ఉమెన్స్‌ డే కేవలం వేడుక కాదు.. సామాజిక బాధ్యత!

  • Today Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నింటిలో విజయమే!

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions