Fighter jets escort Air plane: సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఫ్లైట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ ప్రయాణికులు బాంబు బెదిరింపులకు పాల్పడటంతో విమానాన్ని అత్యవరంగా ల్యాండ్ చేశారు. బుధవారం రోజున చాంగిలోని సిటీ స్టేట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపుల కారణంగా రెండు ఫైటర్ జెట్లు విమానం అత్యవసరం ల్యాండ్ అయ్యేలా ఎస్టార్క్ ఇచ్చాయి.
Read Also: Anushka: తెలంగాణ కోడలు కాబోతున్న అనుష్క.. వరుడు అతడే..?
అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కిన 37 ఏళ్ల వ్యక్తి తన హ్యాండ్ లగేజీలో బాంబు ఉందని బెదిరించాడు. దీంతో సింగపూర్ రక్షణ మంత్రిత్వ శాఖ అప్రమత్తం అయింది. ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ మధ్య సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం చాంగిలో ల్యాండ్ అయింది. తరువాత విచారణలో బాంబు బెదిరింపులు అబద్ధమని తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని సింగపూర్ పోలీసులు వెల్లడించారు. సదరు వ్యక్తి క్యాబిన్ సిబ్బందిపై దాడి చేసినట్లుగా తేలింది. తీవ్రవాద వ్యతిరేక, మాదక ద్రవ్యాల వినియోగం చట్టాల కింద అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ350 విమానం శాన్ ప్రాన్సిస్కో నుంచి సింగపూర్ బయలుదేరింది. 37 ఏళ్ల వ్యక్తి బాంబు బెదిరింపులు చేసినప్పటికీ.. పైలెట్లు విమానాన్ని గమ్యం వైపు తీసుకెళ్లారు. ఆ తరువాత సింగపూర్ ఆర్మీకి చెందిన రెండు ఫైటర్ జెట్లు విమానానికి ఎస్కార్టుగా రక్షణగా నిలుస్తూ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు సహకరించాయి. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.
