NTV Telugu Site icon

రాప్తాడులో టీడీపీ -వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్రగాయాలు !

రాప్తాడు నియోజకవర్గంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని పులెటి పల్లి గ్రామంలో నిన్న ఉగాది పండుగ కావడంతో గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవం జరిగింది. ఉత్సవాన్ని తిలకిస్తున్న టిడిపి వర్గీయులు పై వైసీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. గతంలో గ్రామానికి చెందిన చెరువులో చేపలు పట్టే నెపంతో వైసీపీ వర్గీయులు కాలువలు త్రవ్వి చెరువు నీటిని ప్రక్కకు మళ్లించారు. చెరువులో నీరు వృధా అవుతున్నాయి అని టిడిపి వర్గీయులు సంభందిత అధికారులకు తెలిపి కాలువను నిలిపింప చేశారు. దీంతో ఆ విషయం మనసులో పెట్టుకుని నిన్న అదను చూసుకుని ఉగాది పండుగ రోజు కర్రలతో దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. మరోపక్క కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదోని మండలం కపటి గ్రామంలో బోరు విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల వారు పరస్పర దాడికి దిగారు. ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆధోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.