Site icon NTV Telugu

Ukraine Russia War: రైల్వే స్టేషన్‌పై రష్యా దాడి.. చెల్లాచెదురుగా మృతదేహాలు..

Ukraine

Ukraine

ఉక్రెయిన్‌పై మళ్లీ భీకర యుద్ధం చేస్తోంది రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. అప్పుడప్పుడు తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్‌ ఇస్తున్న రష్యా బలగాలు.. అంతర్జాతీయంగా రోజురోజుకీ తీవ్రమైన ఆంక్షలు వస్తున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. మరోసారి ఉక్రెయిన్‌పై బాంబులపై వర్షం కురిపించింది.. తూర్పు ఉక్రెయిన్‌ను టార్గెట్ చేసిన రష్యా బలగాలు.. రైల్వేస్టేష‌న్‌పై రాకెట్ దాడుల‌కి దిగింది.. ఈ ఘటనలు 30 మందికి పైగా పౌరులు మృతిచెందారని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.. ఇక, 100 మందికి పైగా తీవ్రగాయాలపాలనైట్టు తెలిపారు.. అయితే, రష్యా బలగాలు దాడి చేసిన.. క్రామటోర్స్క్ రైల్వే స్టేషన్ ను సాధారణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వినియోగిస్తున్నారు.. ఆ రైల్వే స్టేషనే రష్యా టార్గెట్ చేసింది. ఇక, రైల్వే స్టేషన్‌లో ఎక్కడ చూసినా మృతదేహాలు, ప్రయాణికుల వస్తువులు మాత్రమే కనిపిస్తున్నాయి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read Also: Nara Lokesh : జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్‌..

ఇక, దాడి అనంతరం ఘటనా స్థలంలో మంటలు చెలరేగి పొగలు అలుముకున్నాయి. రైల్వే స్టేషన్‌లో రెండు దాడులు జరిగాయని చెబుతున్నారు. ఈ దాడి జరిగిన సమయంలో వేలాది మంది ప్రజలు స్టేషన్‌లో ఉన్నారు. రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌పై కేంద్రీకరించింది.. దీంతో… ప్రజలను అక్కడి నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఇదే సమయంలో రైల్వే స్టేషన్‌ను టార్గెట్‌ చేయడంతో సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.. మరోవైపు.. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ప్రకారం.. రష్యన్ దళాలు ఉత్తర ఉక్రెయిన్ నుండి బెలారస్ మరియు రష్యా వైపు పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

Exit mobile version