Kash Patel: కాష్ పటేల్ అతిగా మద్యం సేవిస్తారంటూ కథనం.. రూ.2300 కోట్లు దావా వేసిన ఎఫ్‌బీఐ డైరెక్టర్
- మరో వివాదంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్
- కాష్ పటేల్ అతిగా మద్యం సేవిస్తారంటూ కథనం
- రూ.2300 కోట్లు దావా వేసిన ఎఫ్‌బీఐ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఎఫ్‌బీఐ అనేది ఒక ప్రధానమైన దర్యాప్తు సంస్థ. అమెరికాలో అంతర్గత భద్రత, ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, తీవ్రమైన నేరాలపై దర్యాప్తు చేసే అతిముఖ్యమైన సంస్థ. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఈ సంస్థ డైరెక్టర్‌గా భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్‌ను డైరెక్టర్‌గా నియమించారు. కానీ కాష్ పటేల్ మాత్రం నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. ఆ మధ్య ప్రియురాలి సంగీత కచేరీకి జెట్ ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా దర్యాప్తులో కూడా నత్తనడక ప్రదర్శిస్తారంటూ విమర్శలు ఉన్నాయి.
తాజాగా మరో వివాదం సంచలనంగా మారింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అతిగా మద్యం సేవిస్తారంటూ ‘‘ది అట్లాంటిక్ పత్రిక’’ తన కథనంలో పేర్కొంది. అతిగా మద్యం సేవించడం కారణంగా ముఖ్యమైన విచారణలకు గైర్హాజరు అవుతారని తన కథనంలో హైలెట్ చేసింది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
దీంతో ‘‘ది అట్లాంటిక్ పత్రిక’’ కథనంపై కాష్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా కథనం ప్రచురించిందని.. అదొక తప్పుడు కథనం అని మండిపడ్డారు. దీంతో పత్రికపై, జర్నలిస్ట్ సారా ఫిట్జ్‌ప్యాట్రిక్‌పై 250 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీ ప్రకారం రూ.2300కోట్లు) పరువు నష్టం దావా వేశారు.
కాష్ పటేల్..
కాష్ పటేల్ ఫిబ్రవరి 2025 నుంచి ఎఫ్‌బీఐ చీఫ్‌గా ఉన్నారు. గతంలో కూడా మీడియాపై దావాలు వేశారు. ఇది రెండవ పరువు నష్టం కేసు. ఈ కేసు వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టులో విచారణకు రానుంది.

తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!