రహస్యమనేది ఎప్పటికైనా బయటపడకుండా పోదంటారు. ఏదొక రోజున.. ఏదొక విధంగా రహస్యం బయటపడుతుంది. గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా సాగిస్తున్న ప్రేమాయణం.. ఓ ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా బట్టబయలైంది. దీంతో ఇన్నాళ్లు రహస్యంగా నడిపిస్తున్న యవ్వారం బయటపడడంతో రెండు కుటుంబాల మధ్య చీలికకు దారి తీసింది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Online Harassment: ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి వేధింపులు.. హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్
చైనాలోని ఓ వ్యక్తి గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యాంగ్జియాంగ్‌లోని ఫార్మసీలో గర్భనిరోధక మందులు కొనుగోలు చేశాడు. ఇందుకోసం మొబైల్ ద్వారా చెల్లింపు కోడ్‌ను ఉపయోగించి 15.8 యువాన్లు (సుమారు రూ. 200) చెల్లించాడు. మందులు తీసుకుని వెళ్లిపోయాడు. కానీ పేమెంట్ ఫెయిల్డ్ అయింది. పేమెంట్ క్రెడిట్ కాకపోవడంతో ఫార్మసీ సిబ్బంది.. లింక్ చేయబడిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేశారు.
ఇది కూడా చదవండి: Rasha Tadaney : టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్న..రాషా తడానీ !
ఆ ఫోన్ కాల్ అనుకోకుండా అతని భార్యకు వెళ్లింది. మందులు కొనుగోలు చేసిన డబ్బులు అందలేదంటూ తెలియజేశారు. ఆమె.. ఏ మందులు.. ఏం డబ్బులు అంటూ ఆరా తీసింది. దీంతో సిబ్బంది.. గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లారంటూ బదులిచ్చారు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో భర్త వివాహేతర సంబంధం బట్టబయలైంది. ఈ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్లైంది పేమెంట్ వ్యవహారం.
ఇంత కాలం రహస్యంగా సాగిస్తున్న వివాహేతర సంబంధం ఫోన్ కాల్ ద్వారా బయటపడడంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అయితే ఫార్మసీ సిబ్బంది చేసిన పనిని ఆ వ్యక్తి తీవ్రంగా పరిగణించాడు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యక్తి చట్టపరమైన చర్య తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. అది కష్టమని హెనాన్ జెజిన్ లా ఫర్మ్ డైరెక్టర్ ఫు జియాన్ ఎలిఫెంట్ తెలిపారు. అతని చర్యలకు అతడే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఒక వేళ ఫార్మసీ అతని గోప్యతను ఉల్లంఘించినట్లయితే.. దానిని చట్టబద్ధంగా కూడా జవాబుదారీగా చేయాలన్నారు. ఫార్మసీ సిబ్బంది.. కుటుంబాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించలేదని.. డబ్బుల కోసం చట్టబద్ధంగానే ఫోన్ కాల్ చేశారని స్పష్టం చేశారు.
