Explosion at Hoover Dam: అమెరికాలోని అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్‌లలో ఒకటైన హూవర్ డ్యామ్ వద్ద మంగళవారం ఒక ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. ఈ పేలుడులో మంటలతో కూడిన నల్లటి పొగ భారీ ఎత్తున ఎగిసిపిడింది. యూఎస్ నుంచి ఓ పర్యాటకుడు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్యాటకుడు అక్కడ వీడియో తీస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భయంతో అక్కడ ఉన్నవారు పరుగులు తీశారు.
అరిజోనా, నెవాడా సరిహద్దులో ఉన్న కొలరాడో నదిపై ఇంజనీరింగ్ అద్భుతం హూవర్ డ్యామ్. ఆనకట్ట బేస్ సమీపంలో జరిగిన పేలుడులో ఎవరూ గాయపడలేదు. అరిజోనా, నెవాడా, దక్షిణ కాలిఫోర్నియాలోని చాలా ప్రాంతాల వరకు దాదాపు 8 మిలియన్ల ప్రజలు హూవర్ డ్యామ్ వద్ద ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌నే వినియోగిస్తారని వెస్ట్రన్ ఏరియా పవర్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎంతమేరకు నష్టం జరిగిందో గుర్తించడానికి అధికారులు పని చేస్తున్నారు. కానీ జలవిద్యుత్ డ్యామ్ వద్ద గల పవర్ గ్రిడ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని యూఎస్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ ప్రాంతీయ డైరెక్టర్ జాక్లిన్ గౌల్డ్ వెల్లడించారు. ఉదయం 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి, అరగంటలో మంటలు ఆరిపోయాయని గౌల్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.
BREAKING: There’s been an explosion at Hoover Dam pic.twitter.com/jgSV74tqqR
— Kari Lake (@KariLake) July 19, 2022
