Site icon NTV Telugu

ఎంత అభిమానం ఉంటే ఈ పేరు.. abcdef ghijk zuzu

పిల్లలకు భిన్నమైన పేర్లను పెట్టాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కొందరూ తల్లిదండ్రలు తమ పిల్లలకు విభిన్నమైన పేర్లు పెట్టి మురిసిపోతుంటారు. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన బిడ్డకు వింతైన పేరు పెట్టాడు.

ఆంగ్లంపై అభిమానంతో ఆల్ఫాబెట్‌లోని తొలి 11 అక్షరాలతో పేరు పెట్టేశాడు. ఆ అబ్బాయి పేరు ABCDEF GHIJK ZUZU. అక్కడి అధికారులు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఆ స్కూల్‌కు వెళ్లడంతో 12 ఏళ్ల ఈ బాలుడి పేరును చూసి షాక్‌ అవ్వడం అధికారుల వంతు అయింది. ఎంతటి ఆంగ్ల భాషపై మక్కువ ఉంటే మాత్రం ఇలాంటి పేరు ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version