NTV Telugu Site icon

China: బాస్‌కు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు వింత ప్రవర్తన.. ఏం చేశారో తెలిస్తే..!

China1

China1

అతి వినయం ధూర్త లక్షణం అంటారు పెద్దలు. అంటే అవసరమైన దానికన్నా అధికంగా వినయం చూపేవారి గురించి పెద్దలు ఈ సామెత ఉపయోగిస్తుంటారు. అంతేకాదు.. అతి వినయం దుష్టుల లక్షణం అని కూడా అంటారు. అంటే హృదయంలో లేని గౌరవం.. ప్రవర్తనలో చూపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి గురించే ఈ సామెత ఉపయోగిస్తారు. ఇదంతా ఎందుకంటారా? ఏ కంపెనీలో అయినా బాస్‌ను కాకా పట్టే ఉద్యోగులు ఉంటారు. ఇంకా లేదంటే బాస్ కంటిలో పడేందుకు పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటాం. కానీ చైనాలో ఓ కంపెనీ ఉద్యోగులైతే.. వీటిన్నంటికీ మంచి ఓవరాక్షన్ చేశారు. కావాలనే ఇలా చేశారా? లేదంటే కంపెనీ రూల్సే అలానే ఉన్నాయో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వాళ్లు ఏం చేశారో తెలియాలంటే ఈ వార్త చదవండి.

చైనాలోని గ్వాంగ్‌జౌ క్విమింగ్ కంపెనీకి చెందిన ఉద్యోగులు.. బాస్‌కు వైరటీ స్వాగతం పలికారు. ఏకంగా ఫ్లోర్‌పై పడుకుని వెల్‌కం చెప్పారు. నేలపై పడుకుని… ‘‘క్విమింగ్ బ్రాంచ్ బాస్ హువాంగ్‌కు స్వాగతం! జీవితంలో అయినా, మరణంలో అయినా, మేము మా పని లక్ష్యాన్ని విఫలం చేయం.’’ అంటూ నినాదాలు చేశారు. ఇలా దాదాపు 20 మంది ఉద్యోగులు నేలపై పడుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సంఘటనను కంపెనీ ఖండించినప్పటికీ.. స్థానిక ప్రభుత్వం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది. కంపెనీ విధానాలను, సీసీటీవీ పుటేజీ ప్రామాణికతపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కావాలని చేశారా? లేదంటే కంపెనీ రూల్సే ఇలా ఉన్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. గతంలో పలు కంపెనీల తీరుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కార్మిక చట్టాల్లో కఠిన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. చైనా కార్మిక చట్టాల ప్రకారం.. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలకు లేదా గౌరవానికి భంగం కలిగించే నిబంధనలను నిషేధించాయి.

 

Show comments